villagers compete to fetch free petrol from upsie down tanker

Petrol tanker roll over at chautuppal in nalgonda

Petrol tanker, National Highway, Nalgonda, RangaReddy, Cherlapally, Petrol, IOC Terminal point, CI Naveen Kumar, Malleshwari, Haribabu, Fire Tenders

A Petrol tanker carring 12000 litres of petrol, turned upside dowm due to unbalances on the way to Nalgonda at chautuppal. 6000 liters of petrol was taken by near by villagers and passers.

ఫ్రీ పెట్రోల్ కోసం పోటీ పడ్డ స్థానికులు, వాహనదారులు..

Posted: 06/30/2016 07:02 AM IST
Petrol tanker roll over at chautuppal in nalgonda

మొన్న ఆ మథ్య రంగారెడ్డి జిల్లా మూసాపేటలో బీరు బాటిళ్ల కోసం పోటీ పడ్డ ప్రజలు.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉచిత పెట్రోల్ కోసం పోటీ పడ్డారు. మండలంలోని  మల్కాపురం శివారు 65వ నంబరు జాతీయ రహదారిపై ఓ పెట్రోలు ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయ్యి వృధాగా పోతుండడాన్ని గమనించిన స్థానికులు పెను ప్రమాదం పోంచి వుందని తెలిసినా.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉచిత పెట్రోల్ కోసం పోటీ పడ్డారు.

వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పెట్రోల్‌ను బకెట్లలో, క్యాన్లలో నింపుకొని తీసుకెళ్లారు. హైవే మీదుగా వెళ్తున్న కార్లు, మోటార్ సైకిళ్లను ఆపి, డబ్బాలతో వాహనాల్లో పెట్రోల్ పోసుకున్నారు. అయితే పెట్రోల్ ట్యాంకర్ నుంచి అప్పటికే పెట్రోల్ లీకై వెళ్తుండటంతో.. జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యలవుతారని.. వేల రూపాయల కోసం ప్రాణాలను పణంగా పెడతారా అని సీఐ నవీన్‌కుమార్ స్థానికులను ప్రశ్నించారు.

ఆయనతో పాటు  ఎస్‌ఐలు మల్లీశ్వరి, హరిబాబు అక్కడికి వచ్చి, జనాన్ని చెదరగొట్టారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పెకైత్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైరింజన్‌ను రప్పించారు. రంగారెడ్డి జిల్లా చర్లపల్లి ఐవోసీ టెర్మినల్ పాయింట్ నుంచి నల్లగొండకు 12 వేల లీటర్ల పెట్రోలుతో బయలు దేరిన ఏపీ 31డబ్ల్యూ 4668 నంబరు గల ట్యాంకర్ చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles