చైనాలో దారుణం జరిగింది. నడిరోడ్డేపై దుశ్యాసన పర్వం సాగింది. అనేక మంది ఈ పర్వాన్ని చూస్తూ వుండిపోయారు కానీ ఓ మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని అపలేకపోయారు. అయితే ఏ మగమృగాళ్ల చేతిలోనో ఘోరం జరగలేదు. మహిళల చేతిలోనే మరో మహిళ తన పరువును పోగోట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు దుశ్యాసన మహిళలు భాధిత మహిళను విచక్షణ రహితంగా కొట్టారు. బట్టలు చింపుతూ ఇష్టమొచ్చినట్టు కొడుతూ ఆ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు కూడా చేశారు.
దీనికి సంబంధిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆ మహిళల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమ స్నేహితురాలి భర్తతో ఆ యువతి చనువుగా ఉంటున్నట్టు దాడికి దిగిన మహిళా గ్రూప్ ఆరోపించింది. నడి రోడ్డు అని కూడా చూడకుండా అందరూ చూస్తుండగానే ఆ యువతిని కొడుతూ, బట్టలు చింపుతూ, జుట్టుపట్టుకొని ఈడ్చుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావీన్స్లో బొజ్హో ప్రాంతంలో చోటుచేసుకుంది.
అక్కడున్న వారిలో ఓ మహిళ వచ్చి కల్పించుకొని యువతిని రక్షించడానికి ప్రయత్నించగా వారు అమెతో కూడా వాగ్వాదానికి దిగారు. మిగాతా వాళ్లు మాత్రం చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఈ తతంగాన్ని ఫోన్లతో రికార్డు చేస్తూ తమకు పట్టనట్టుగా వ్యవహరించారు. ఆ వీడియో చూసిన వారు ఆ మహిళా గ్రూప్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముందు మీ భర్తను అదుపులో పెట్టుకొండి, కొడితే తప్పు చేసిన మీ భర్తను కొట్టండి. అంతే కానీ, ఓ యువతిని అలా కొట్టడమేంటి అని... నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more