అక్కడ జరుగుతున్న తంతు చూస్తే.. మనలో చాలా మందికి అర్థం కాదు. కానీ అక్కడ జరుగుతున్న పరిణయ మహోత్సవం. క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం చర్చిలోని ఫాథర్ సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. వరుడు ఆరన్ చక్కగా బ్లాక్ సూటు, కోటు వేసుకొని పెళ్లికొడుకులా ముస్తాబయ్యాడు. అయితే అక్కడ కేవలం వరుడు మాత్రమే కనబడుతున్నాడు. మరి వధువు ఎక్కడా..? అంటారా..? ఆయన పెళ్లి చేసుకోబోయే వధువు కూడా చక్కని కవర్‌లో ఒదిగి ఉంది.
ఇక్కడే మీకు సందేహం కలుగుతుంది కదూ..? పెళ్లి కూతరు కవర్ లో వుండటానికి అదైమైన వస్తువా..? మనిషి కాదా..? అన్న అనుమానాలే వద్దు..? మీరు ఊహించింది.. మేము చెప్పాలనుకుంది ఒక్కటే. అయన వివాహం చేసుకుంది స్మార్ట్ ఫోన్ ను. అర్థం కాలేదా..? వధువరులు ఎదురెరుగా వుండగా పెళ్లి పెద్ద మైఖేల్ కెల్లీ.. ఇద్దరితో ప్రమాణాలు చేయించాడు. ఆరన్ అనబడే నువ్వు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చట్టబద్ధంగా వివాహం చేసేందుకు సమ్మతిస్తున్నావా? ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రేమిస్తూ.. గౌరవిస్తూ.. విశ్వసనీయంగా ఉంటూ.. సుఖంగా చూసుకుంటానని దైవసాక్షిగా వాగ్దానం చేస్తున్నావా? అని ఆరన్‌ని అడిగాడు.
అందుకు ఆరన్ సమ్మతించడంతో అంగరంగ వైభవంగా స్మార్ట్‌ఫోన్‌తో అతని పెళ్లి జరిగింది. పోయి, పోయి స్మార్ట్‌ఫోన్‌ను పెళ్లిచేసుకోవడం ఏమిటని విస్తుపోతున్నారా? అవునండి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆరన్ చెర్వెనార్ ఏరికోరి మరీ తన మొబైల్ ఫోన్‌ను పెళ్లిచేసుకున్నాడు. ఈ పెళ్లి తంతు మధురానుభూతిగా మిగిలిపోవాలని అతడు లాస్ ఏంజిల్స్ నుంచి లాస్ వెగాస్ వచ్చి.. అక్కడ సంప్రదాయబద్ధంగా స్మార్ట్‌ఫోన్‌ను జీవిత భాగస్వామి చేసుకున్నాడు. ఈ విచిత్రమైన పెళ్లి తంతు జరిపించే పెద్దగా మైఖేల్ కెళ్లి వ్యవహరించారు.
లాస్ వెగాస్‌కు పెళ్లి కోసం వచ్చే ఎంతోమంది జంటలను తాను ఏకం చేశానని, తొలిసారిగా ఆరన్-సెల్‌ఫోన్ జంటకు వివాహం చేశానని మైఖేల్ చెప్పారు. మరీ ఆరన్ స్మార్ట్‌ఫోన్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే అందుకు కారణం లేకపోలేదు. మనుష్యులకు ఇప్పుడు సెల్‌ఫోన్‌తో అనుబంధం విపరీతంగా పెరిగిపోయింది. అది లేకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అస్తమానం సెల్‌ఫోన్ దగ్గరుండాల్సిందే. అలా స్మార్ట్‌ఫోన్‌కు మనుష్యులు బానిసలు అయిపోతున్నారు కనుక తాను దానిని పెళ్లి చేసుకుంటే తప్పేమున్నదని భావనతో ఆరన్ ఇంత పనిచేశాడట.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more