నొప్పులు పడుతున్న గర్భిణి అని కూడా చూడకుండా... దారుణం | Woman Gives Birth In Hospital Toilet In Muzaffarnagar

Woman gives birth in hospital toilet in muzaffarnagar

woman deliver in hospital toilet, Thana Bhawan health centre, టాయిలెట్ లోనే ప్రసవం, తాజా వార్తలు, జాతీయ వార్తలు

Fathima a 37-year old woman delivered her baby in a hospital's toilet after she was allegedly denied admission in the health centre in Thana Bhawan town in Muzaffarnagar on Wednesday.

నొప్పులు పడుతున్న గర్భిణి అని కూడా చూడకుండా... దారుణం

Posted: 06/30/2016 11:01 AM IST
Woman gives birth in hospital toilet in muzaffarnagar

ఇలాంటి ఘటనలు వింటున్నప్పుడు అసలు మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అన్న సందేహాలు కలగక మానవు. ఓ ఆస్పత్రి సిబ్బంది చేసిన నిర్వాకానికి జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. నిండు చూలాలు అని కూడా చూడకుండా ఆమె పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముజుఫర్ నగర్ ధనాభవన్ ఆరోగ్య కేంద్రలో బుధవారం చోటుచేసుకున్న ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఫాతిమా(37)ను ఆమె థనాభవన్ లోని హెల్త్ సెంటర్‌కు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే విలవిల్లాడుతున్న ఆమెను చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. బిజీగా ఉన్నామని మరో మూడు రోజుల తర్వాత రావాలని నిర్లక్ష్యంగా చెప్పారు. షాక్ తిన్న దంపతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. బిత్తరపోయి కాసేపు అలాగే ఉండిపోయారు.

అనంతరం ఆస్పత్రిలోని టాయిలెట్‌కు వెళ్లిన బాధితురాలు అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు తీరిగ్గా అప్పుడు ఆమెను లోపలికి అనుమతించారు. తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ చందర్ తెలిపారు. అయితే సిబ్బంది వ్యవహారం వెలుగు చూడటంతో వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muzaffarnagar  Thana Bhawan  woman  deliver  hospital toilet  

Other Articles