మీరు చదవిన శీర్షక కరెక్టే. మీకు ఎనమిది స్పెల్లింగ్ తెలుసా..? మాకేంటీ మా తమ్ముడు 1వ తరగతి చదువుతున్నాడు వాడికి కూడా వచ్చు. అయినా ఈ స్పెల్లింగ్ రానీ వారుంటారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయా..? అవునండీ నిజమే. మీకు తెలిస్తే.. కాస్తా ఈ టాపర్లకు చెప్పరు. ఏంటీ పాలిటెక్నిక్ టాప్ ర్యాంకర్లకు ఎయిట్ స్పెల్లింగ్ తెలియదా..? మేము వాళ్లకు చెప్పాలా.? అంటూ ఆశ్చర్యపోకండి.. మీరు చదివింది కరెక్టే. ఈ టాపర్లకు ఎయిట్ స్పెల్లింగ్ రాదు. ఏదో ఒక్కరు అనుకుంటే కాదండీ ఏకంగా 28 మందికి ఎయిట్ స్పెల్లింగ్ రాదు. అదేంటి..?
పొలిటికల్ సైన్స్ అంటే వంటశాస్త్రమని చెప్పి బీహార్ ఇంటర్మీడియట్ టాపర్ రూబీ రాయ్ ఆశ్చర్యపర్చిన అంశాన్ని ఇంకా మర్చిపోక ముందే మరో టాపర్స్ స్కామ్ బయటపడింది. అయితే ఈ సారి బీహార్ లో కాకుండా మరో ఏడాది కాలంలో ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్ ప్రదేశ్ లో స్కామ్ బయటపడింది. ఉత్తరప్రదేశ్ పాలిటెక్నిక్‌లో టాపర్లుగా నిలిచిన వారిపై అనుమానం వచ్చిన యూపిలోని టెక్నికల్ బోర్డు వారికి పరీక్ష నిర్వహించింది. టాపర్లను 8 అంకె స్పెల్లింగును రాయమంటే అంతా గుడ్లు మిటకరించి, బిక్కమొఖం వేసుకుని చూశారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది పాలిటెక్నిక్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులు 8 అంకెను ఆంగ్లంలో ఎలా రాయాలో తెలీకపోవడంతో బిక్క ముఖం వేసుకుని నిలబడ్డారట. దీనితో పరీక్ష నిర్వహించేవారికి అనుమానం వచ్చి మరలా తాము రాయమన్నది 8 అనే అంకెకు ఆంగ్లంలో స్పెల్లింగ్ అని చెప్పారట. ఐనా వారి నుంచి సమాధానం లేదు. దీనితో సదరు విద్యార్థుల సత్తా ఏమిటో తెలిసిపోయి ప్రవేశ పరీక్షా సమయంలో వారంతా మోసాలకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. వెంటనే వారి ఫలితాలను రద్దు చేయడమే కాకుండా మళ్లీ వారు పరీక్ష రాయకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పాలిటెక్నిక్ పరీక్షలను కూడా రద్దు చేసి.. మరోమారు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే వీరి మోసాలపై సాంకేతిక విద్య విభాగం అధికారులు జెడీ మనోజ్ కుమార్ నేతృత్యంలో నలుగురు సభ్యలతో కమిటీ విచారణ చేపట్టగా అందులో మరిన్ని విస్మయానికి గురిచేసే విషయాలు బయటపడ్డాయి. యూపీ పాలిటెక్నిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 28 మంది విద్యార్థులందనూ ఒకే పరిక్షా కేంద్రం నుంచి.. అందులోనూ ఓకే గదిలో పరిక్ష రాసారని అధికారులు తెలుసుకున్నారు. అలాగే ఆ విద్యార్థులను ప్రవేశ పరీక్షలో అర్హులుగా చేసిన గౌతమ్ బుద్దా ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ పై కూడా చర్యలకు తీసుకున్నారు. ఇదిలావుండగా, మెడికల్ కాలేజీ కోసం బీహార్ లో ఓ కేంద్రమంత్రి అండతో ఆ స్కామ్ జరిగిందన్న అరోపణల నేపథ్యంలో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లనున్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ స్కామ్ వెనుక ఎవరున్నారన్నది తేల్చాల్సివుంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more