ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు చెప్పగానే ఆదరణకు కొదవుండదు. ఆయనకు ఎంత ఆదరణ వుందో గత రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికలలో బీజేపికి వచ్చిన మోజారిటీని చూస్తే అర్థమవుతుంది. అయితే మోడీకి వ్యతిరేకంగా ఓ పుస్తకం వస్తుంది అని తెలియగానే సరిగ్గా అలాంటి అధరణనే లభిస్తుంది. ప్రధాన మంత్రి మోడీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చ లేదని ఆయన హామీలను తూర్పారబడుతూ.. వ్యంగ్యాస్థాలతో కించిపరుస్తూ ఇటీవల మార్కెట్లో విడుదలైన పుస్తకం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయట.
'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' పేరుతో కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా రచించిన పుస్తకానికి అభిమానులు ఎక్కువైపోయారు. గుజరాత్ రాష్ట్రంలోనే కాక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో కూడ పుస్తకం అమ్మకాలు జోరుగా సాగిపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా మోదీపై వ్యంగ్యోక్తులు విసురుతూ రాసిన పుస్తకం మార్కెట్లో ప్రాచుర్యం పొందిందట. పలు రాష్ట్రాల్లో ఆ పుస్తకానికి భారీ అమ్మకాలు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి.
'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' అంటూ ఎన్నికల సమయంలో మోదీ చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంపై జయేష్ షా ఈ పుస్తకాన్ని రాశారు. అయితే పుస్తకంలోని రచనలు ప్రధానమంత్రిని కించపరిచేలా ఉన్నాయని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ అభిమాని, సామాజిక కార్యకర్త నర్సింహు సోలంకి అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని అహ్మదాబాద్ సివిల్ కోర్టు కొట్టేయడం తెలిసిందే.
తమ భావాలను తెలిపే హక్కు ప్రతివారికీ ఉంటుందని, పుస్తకంపై నిషేధం విధించడం సరికాదని, అలా చేస్తే వాక్ స్వాతంత్రంపై దాడి చేసినట్లే అవుతుందని న్యాయమూర్తి వివరణ కూడ ఇచ్చారు. అయితే మోదీపై వ్యంగ్యాస్థాలు సంధిస్తూ రాసిన ఆ పుస్తకం గురించి ముందు ఎవరికైనా తెలుసో లేదో గాని, కోర్టు సైతం అభ్యంతరాలను తోసి పుచ్చడంతో ఇప్పుడు ఆ పుస్తకానికి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిపోయిందట. నిజంగా ఆ పుస్తకంలో ఇంకా ఏం రాశారో చదవాలన్న ఉత్కంఠత ప్రజల్లో నెలకొని సెల్స్ అదిరిపోతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more