questioning the invasion of dancing naked leads attack

Naked dances in hyderabad police files cases

naked dance in lb nagar, naked dance in hyderabad, naked dance leads to attack, three youth arrested for naked dance, local guy attacked in lb nagar, three youth naked dance, police case on naked dance, crime,

Three youth performed naked dances in hyderabad lb nagar, Questioning the invasion by a local guy lead to attack. police filed case and took the three into custody

హైదరాబాద్ లో నగ్న నృత్యాలు.. కేసు నమోదు..

Posted: 07/01/2016 08:42 AM IST
Naked dances in hyderabad police files cases

సభ్య సమాజంలో మనం కూడా ఒకరమని మరిచారు ఆ యువకులు. ఇంటి చుట్టుపక్కల కూడా తమ మాదిరిగానే మనుషులున్నారన్న విషయాన్ని మర్చారు. అత్యంత హేయకరంగా ప్రపర్తించారు. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన కాలనీ యువకుడిపై దాడి చేసి గాయపర్చారు. ఇంతకీ ఎవరు వారు..? ఏం చేశారనేగా మీ సందేహం. ఉపాధి ఉద్యోగం కోసం వచ్చిన ఓ ముగ్గురు యువకులు ఎల్బీ నగర్ లో గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

అయితే వారికేం పోయే కాలం వచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఒంటిపై నున్న వలువలు (దుస్తులు) తొలగించి నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నారు. చుట్టుపక్కల వారు చూస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి వారు అలా చేయడంతో ఓ యువకుడి తెగించి వారిని ప్రశ్నించాడు. దీంతో ఆ ముగ్గురు యువకులు అగిడిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గాయపడిన బాధిత యువకుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి నగ్న నృత్యం చేస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

youth naked dance at lbnagar

పోలీసుల కథనం ప్రకారం.... ఎల్బీనగర్ బ్యాంక్‌కాలనీలో ఉండే కనకదుర్గమ్మ ఇంటికి ఎదురుగా ఉండే గిరి, జిలానీ, మరో యువకుడు ఒంటిపై దుస్తులు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. స్థానిక మహిళ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దూషించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కొడుకు సురేష్ వారిని నిలదీయగా ముగ్గురూ కలిసి దాడి చేసి గాయపరిచారు. సురేష్‌ను చికిత్స నిమిత్తం హెల్త్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గిరి, జిలానీ తో పాటు మరో యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naked dance  lb nagar police  bank colony  three youth arrest  attack  

Other Articles