యువరాజు పెళ్లిపై వేసిన జోక్ పేలిందంతే....| subramanian swamy satires on rahul gandhi marriage

Subramanian swamy satires on rahul gandhi marriage

BJP leader Subramanian swamy, Subramanian swamy satires on rahul marriage, rahul gandhi marriage rumour

BJP leader Subramanian swamy satires on rahul gandhi marriage.

యువరాజు పెళ్లిపై వేసిన జోక్ పేలిందంతే....

Posted: 07/06/2016 05:14 PM IST
Subramanian swamy satires on rahul gandhi marriage

సొంత నేతలనే కాదు అప్పుడప్పుడు ప్రత్యర్థులపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంధించే బాణాలు చాలా పదునుగా ఉంటాయి. సింపుల్ గా ఒక్క డైలాగ్ తో వేసే సెటైర్ గాలి తీసేయటంతోపాటు అందులో ఉన్న విపరీతార్థం చమత్కారం మాములు జనాలకు కూడా తొందరగా చేరిపోతుంటాయి.

తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అలహాబాద్ కి చెందిన బ్రాహ్మణ అమ్మాయితో వివాహం కుదిరిందనే వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాల మాట పక్కనుంచి యూపీ ఎన్నికల దృష్ట్యా అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడా? అని ప్రత్యర్థులంతా దుమెత్తిపోశారు. ఆ వరుసలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు.

అయితే అయినా స్టైలే వేరు కదా అందుకే కాస్త ఢిపరెంట్ గా స్పందించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో 'బుద్ధు' త్వరలో యూపీ బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసిందని ట్వీట్ చేశారు. అయితే, దీనిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన మరో సందేశాన్ని ట్వీట్ చేశారు. రాహుల్ పెళ్లి చేసుకోవడమంటే సూర్యుడు పశ్చిమాన ఉదయించడం లాంటిదేననే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేయటంతో నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వుకున్నారు.

కానీ, కాంగ్రెస్ మాత్రం దీనిపై తీవ్రంగా సీరియస్ అయ్యింది. ఎవరో సోషల్ మీడియాలో లేపిన పుకారును పట్టుకుని రాహుల్ పెళ్లంటూ కొందరు రాజకీయం చేస్తున్నారు. అదంతా ఉత్తదేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బహుశా సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇలానే పొరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటారేమో అని రివర్స్ కౌంటర్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ అది పెద్దగా పేలలేదు. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ... మీడియా లో వచ్చిన వార్తల ఆధారంగానే ఆ వ్యాఖ్యాలు చేశానంటూ మరోసారి వారిని పేర్కొంటూ ఇంకో సెటైర్ వేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Subramanian Swamy  Congress  Rahul Gandhi  marriage  satires  

Other Articles