Mohammad Amir at Lord's will make me sick, says Graeme Swann

Amir s return to lord s makes graeme swann feel sick

Mohamamd Amir, Amir Lord's Test, England vs Pakistan, Graeme Swann, Swann Amir

Former England off-spinner Graeme Swann urged the international cricket body to make sure there was no place for corrupt players if it plans to help cricket grow and inspire youngsters.

పాకిస్థాన్ పేసర్ అమీర్ పై అసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Posted: 07/09/2016 08:47 PM IST
Amir s return to lord s makes graeme swann feel sick

స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆమిర్ను తిరిగి క్రికెట్లో ఎందుకు ఆహ్వానించారంటూ తీవ్రంగా మండిపడ్డాడు. జీవిత కాలం నిషేధం విధించాల్సిన బౌలర్కు  పునరాగమనం ద్వారా ఆడే అవకాశం కల్పించడం కచ్చితంగా  పెద్ద తప్పిదమేనని పేర్కొన్నాడు. '2010లో నో బాల్స్ వేయడం ద్వారా ఫిక్సింగ్ కు పాల్పడిన ఆమిర్ పై జీవితం కాలం నిషేధం విధించి ఉండాల్సింది. ఆటలో పారదర్శకతను కోరితే అటువంటి వారిని తిరిగి జట్టులో ఆడే అవకాశం ఎందుకు కల్పిస్తారు.

ఆమిర్ లాంటి వాళ్లను అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడే అవకాశం లేకుండా చేస్తే అది క్రికెట్ ఎదుగుదలకు దోహద పడుతుంది. దాంతో పాటు యువ క్రికెటర్లకు కూడా అదొక ఆదర్శవంతంగా నిలుస్తుంది.  అవినీతికి పాల్పడే వారికి జట్టులో స్థానం అనేది ఉండకూడదు 'అని స్వాన్ ధ్వజమెత్తాడు. అయితే అంతకుముందు ఆమిర్ పై తమకు ఎటువంటి ద్వేషం లేదని ఇంగ్లండ్ క్రికెట్ జట్టులోని సభ్యులు కొందరు మద్దుతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో పాటు, స్టువర్ట్ బ్రాడ్ లు ఆమిర్ ను స్వాగతిస్తున్న తరుణంలో ఆ దేశానికే చెందిన స్వాన్ భిన్నమైన వైఖరి వ్యక్తం చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohamamd Amir  Amir Lord's Test  England vs Pakistan  Graeme Swann  

Other Articles