Man sends Rs 500 bribe through registered post to Bihar official

Man sends rs 500 bribe through registered post to bihar official

Bihar, Bihar Information Commission, Rs 500 bribe, registered post, Sanoj Mishra, Khagaria district, Sachivalya police station, Bada-babu, register letter, bihar officials, information petition

A man in Bihar has sent a bribe of Rs 500 by registered post to an official of the Bihar Information Commission to ensure speedy processing of his petition,

కలకలం రేపిన రిజిస్టర్ పోస్టు..

Posted: 07/10/2016 07:04 AM IST
Man sends rs 500 bribe through registered post to bihar official

రిజిష్టర్ పోస్టు.. ఈ ఉత్తరం అందుకున్న వారు ఖచ్చితంగా రిజస్టర్ పోస్టు అందినట్లు సంతకం చేసుకుని తీసుకోవాల్సి వుంటుంది. అదే ఇప్పుడు బాహార్ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. తోక లేని పిట్టగా అభివర్ణించబడే ఈ ఉత్తరం అంతకుమించిన ప్రచారం పోందుతుంది. అదెలా అంటే ఓ తనకు కావలసిన సమాచారం అందించాలని కోరుతూ ఓ వ్యక్తి బిహార్ అధికారికి పోస్ట్ ద్వారా లంచాన్ని పంపించాడు. ఆ పోస్ట్ బిహార్ సమాచార కమిషన్ ఆఫీసులో కలకలం రేపింది. దానిని అందుకునేందుకు అధికారులు ముందుకు రాక.. ఎట్టకేలకు తీసుకున్న అధికారులు దానిపై సచివాలయ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు కూడా చేశారు. ఖగారియా జిల్లాకు చెందిన సనోజ్ మిశ్రా ఇటీవల ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఓ పిటీషన్ దాఖలుచేశాడు.

అయితే ఈ పిటీషన్ వివరాలు తనకు త్వరగా తెలియజేయాలని కోరుతూ ఇన్ఫర్మేషన్ లో పనిచేసే ఓ ఉద్యోగికి రిజిస్ట్రర్ పోస్ట్ లో రూ.500 పంపించాడు. అందులో అతను సొంతంగా రాసిన ఓ లేఖ.. తాను పంపిన డబ్బులను ఉద్యోగి పిల్లలకు స్వీట్లు కొనిపించాలని కోరాడు. ఆఫీస్ అడ్రస్ రాసి రిజిస్టర్ పోస్ట్ పై బడా-బాబు అని రాశాడని ఓ అధికారి వెల్లడించారు. పాట్నాలోని సచివాలయ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులను ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎవ్వరూ నోరువిప్పేందుకు సముఖత చూపలేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar Information Commission  Rs 500 bribe  registered post  Sanoj Mishra  

Other Articles