9-year-old Ramya, victim of drunk driving, loses battle with death

After 9 day battle ramya gives up

hyderabad, hyderabad drunk driving, drunk driving, banjara hills road, hyderabad student, hyderabad accident, news, india news

"She stopped responding to treatment since that day... almost brain dead. She gave up the battle Saturday," an administrator at the Care Hospital said Sunday morning.

పోరాడుతూ ఓడిన రమ్యకు ప్రముఖుల సంతాపం

Posted: 07/10/2016 11:20 AM IST
After 9 day battle ramya gives up

మృత్యువుతో పోరాడుతూ చిన్నారి రమ్య ఓడింది.. వారానికిపైగా వెంటిలేటర్‌పై మృత్యువుతో చేసిన పోరాటంలో ఆమె అలసిపోయి శాశ్వత నిద్రలోకి జారుకుంది. వారం రోజులకు పైబడి పోరాడుతున్నా.. కనికరం లేని మృత్యువు రమ్యను కబళించివేసింది. అదే ప్రమాదంలో క్షతగాత్రురాలైన ఓ తల్లికి కడపుకోతను మిగిల్చింది. తన కూతురికి ఏం కాదు.. భగవంతుడు వున్నాడని అప్పటి వరకు విశ్వసించిన అ తల్లికి దేవుడే అన్యాయం చేశాడని.. తన బిడ్డను అన్యాయంగా తీసుకెళ్లాడని రోధిస్తూన్న అమెను చూసి అస్పత్రి ప్రాంగణం, వారి నివాసం పరిసర ప్రాంతాలు విషాధ చాయలు అలుముకున్నాయి.

బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె బాబాయి రాజేశ్ అక్కడిక్కడే మరణించగా రమ్య, ఆమె తల్లి, తాతయ్య గాయపడ్డ సంగతి తెలిసిందే. మద్యం సేవించిన నలుగురు స్టూడెంట్స్ వేగంగా కారు నడుపుతూ వచ్చి డివైడర్‌ను ఢీకొట్టగా, వారు ప్రయాణిస్తున్న కారు ఎగిరి అవతలవైపు నుంచి వస్తున్న మరో కారుపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమ్య తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను కేర్ ఆసుపత్రిలో చేర్చారు. తలలో అంతర్గత రక్త స్రావం కారణంగా రమ్య మరణించిందని డాక్టర్లు తెలిపారు.

తొలి రోజు స్కూల్‌కి వెళ్లిన రమ్య ఇంటికి తిరుగుపయనం అవుతూ అంతలోనే తిరిగి రాని లోకాలు వెళ్లడం కలచివేస్తోంది. రమ్య తల్లి రాధిక, మరో బాబాయి, తాతయ్యలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.  చిన్నారి మృతితో రమ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం రమ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రమ్య మృతికికారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రాధిక డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు విద్యార్థులు నా కూతురిని మళ్లీ తీసుకొస్తారా అని ఆమె విలపించారు. ఇలాంటి రోదన ఏకుటుంబానికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

కాగా, తమ కూతరు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలి తల్లి, బంధువులు అరోపిస్తున్నారు. తన బిడ్డ కోమాలోకి జారుకున్న తరువాత అమెను వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదని దీంతోనే అమె చనిపోయిందని లేని పక్షంలో రమ్య బతికేదని వారు అరోపిస్తున్నారు. తాము అపరేషన్ చేయాలని కోరినా.. స్కానింగ్ రిపోర్టులు, రాకుండా తరువాత స్కానింగ్ మెషిన్లు లేకుండా తాము అపరేషన్ చేయలేమని నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చారన్నారు. తాము కేవలం పేషంట్ కండీషన్ ను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి చికిత్స లేకుండా పర్యవేక్షించినంత మాత్రం రమ్య ఎలా బతుకుతుందని వారు ప్రశ్నించారు.

ఇదిలా వుండగా ఉస్మానియా ఆసుపత్రిలో రమ్య కుటుంబసభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్ పరామర్శించారు. రమ్య మృతి బాధాకరం అన్న ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా వుందని అన్నారు. అటు మరోవైపు బీజేపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రమ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాడు. అమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : switzerland  Burka ban  Ticino state  Middle East  Lugano  

Other Articles