Major Earthquake Threat Detected Under Bangladesh, India And Myanmar

Megathrust earthquake could kill crores in india and bangladesh

earthquake, environment, japan, bangladesh, burma, myanmar, india, tectonic shift, subduction zone, lithospheric plates, seismically active, megathrust fault, tectonic boundary, 2004 indian ocean tsunami, 2011 japan earthquake

A huge earthquake that can turn urban areas in eastern India into “ruins” may be building beneath Bangladesh, a new study has warned.

భారత్.. బంగ్లాలకు పెను ముప్పు పోంచివుందా..?

Posted: 07/13/2016 09:41 AM IST
Megathrust earthquake could kill crores in india and bangladesh

భారత్‌, బంగ్లాదేశ్ లకు పెను ప్రమాదం పొంచివుందా..? బంగ్లాదేశ్ కేంద్రంగా ముప్పు కేంద్రీకృతమైవుందా..? ప్రకృతి ప్రకోపం ఈశాన్య భారతం సహా బంగ్లాదేశ్, వియత్నాం దేశాలపై పంజా విసరనుందా..? అత్యంత తీవ్రస్థాయిలో రెక్టార్ స్కేలుపై 9 తీవ్రతతో భారీ భూకంపం విరుచుకుపడబోతోందా? ఈశాన్య భారత ప్రాంతాన్ని కబళించివేసేందుకు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ‘రహస్యం’గా పొంచిఉందా? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రవాసులను శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూఅంతర్భాగంలో ఇది ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. భూమి అడుగున ఉన్న టెక్టానిక్ట్‌ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల భారతలోని ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు ‘నాశన’మవుతాయని హెచ్చరించారు. సుమారు 14కోట్ల మందిపై ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రధాన నదుల్లోని నీటి మట్టాల్లో, నీటి ప్రవాహాల్లో గణనీయమార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడించారు.

భూమి పొరల్లోని టెక్టానిక్ట్‌ ప్లేట్లు కుంగిపోవడం వల్ల ఆ భూభాగంలో ఒత్తిడి పెరిగి, ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని వివరించారు. హిందూ మహాసముద్రంలోని భూకంపం, 2004లో సుమారు 2,30,000మందిని పొట్టనపెట్టుకున్న సునామీ, 2011 తొహోకూలో భూకంపం సంభవించిన ప్రాంతాలన్నీ ఇలా ఏర్పడినవేనన్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే.. బీభత్సం తప్పదని, రిక్టర్‌ స్కేల్‌పై 8.2 కంటే ఎక్కువ తీవ్రతలో భూ కంపం విరుచుకుపడుతుందని శాస్త్రవేత్త మైకెల్‌ స్టెక్లర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Bangladesh  Major threat  potential earthquake  Nature Geoscience  study  

Other Articles