Rahul Gandhi sleeps in Lok Sabha during debate on Gujarat Dalit assault

Rahul gandhi dozes off in lok sabha again

rahul gandhi, rahul gandhi sleeping, rahul gandhi sleeping lok sabha, lok sabha news, rahul gandhi sleeping dalit discussion, gujarat dali issue

This came as a shocking revelation on live TV and left viewers wondering how serious the MP of the second largest party in India is about doing his job.

ITEMVIDEOS:మళ్లీ కునుకు తీస్తూ చిక్కిన రాహుల్.. అధికారపక్షం విసుర్లు..

Posted: 07/20/2016 03:24 PM IST
Rahul gandhi dozes off in lok sabha again

అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా త్వరలోనే పగ్గాలను అందుకుంటారని రాహుల్ గాంధీపై స్వామిభక్తిని చాటుకుంటున్న కాంగ్రెస్ ఎంపీలు, నేతలు.. ఆయనను అబాసుపాలు కాకుండా చేయలేకపోతున్నారు. కాంగ్రెస్  ఉపాధ్యక్ష హోదాలో కోనసాగుతూన్న సమయంలోనే రాహుల్ గాంధీ లోక్ సభలో కునుకు తీస్తూ కెమెరాకు చిక్కారు. గుజరాత్లో దళితులపై దాడుల అంశంపైన సీరియస్‌గా చర్చ సాగుతున్న సమయంలో రాహుల్.. తన కుర్చీలో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో వివరణ ఇస్తుండగా రాహుల్ నిద్రపోయారు. అదే సమయంలో లోక్ సభ టీవి లైవ్ కెమెరాకు చిక్కారు.

కాంగ్రెస్‌ ఎంపీలు ఆయనను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ఆయన నిద్రపోలేదని, కేవలం కిందకు చూస్తున్నారని వాదిస్తున్నారు. కాగా యువనేత లోక్ సభలో నిద్రపోవటం ఇదే తొలిసారి కాదు. దీంతో బీజేపీ నేతలకు ఛాన్స్ దొరకడంతో కాంగ్రెస్ యువనేతపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. లోక్సభలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రలోకి ఎలా జారుకుంటారని ప్రశ్నించారు. గత పదేళ్ళు పడుకున్న కాంగ్రెస్ నేతకు ఇంకా నిద్ర సరిపోలేదా? అంటూ సెటైర్లు వేశారు. ఇటు మీడియాలోనూ రాహుల్ నిద్రపోతున్న దృశ్యాలు హాట్ టాపిక్ గా మారాయి.



ఇక దాడికి గురైన బాధితుల్ని పరామర్శించేందుకు గురువారం రాహుల్ ఉనా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఆయన నిద్ర పోవటం ఆ పార్టీకి తలనొప్పి వ్యవహారంగానే చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ మాత్రం సభలో  రాహుల్ నిద్రపోలేదని వాదిస్తోంది. చర్చ సమయంలో రాహుల్ కిందకు చూశారంటూ సమర్థించుకుంది. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని వ్యాఖ్యానించింది. కాగా గుజరాత్లోని ఉనాలో దళితులపై దాడి అంశం పార్లమెంట్ను కుదిపేస్తోంది. రెండు సభలను అట్టుడుకిస్తోంది. గోమాంసం పంపిణీ చేస్తున్నారనే కారణంతో కొందరు దళిత యువకులను బహిరంగంగా రోడ్డుపై నిల్చొబెట్టి కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీని వీడియోలు బయటకు రావడంతో భారీ ఎత్తున ఆందోళన గందరగోళం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  camera  sleeping  lok sahba  Gujarat Dalit attack issue  congress  

Other Articles