ఫ్రాన్స్-బ్రిటన్ సరిహద్దులో ట్రాఫిక్ నరకం | 40 hour traffic jam at England France border

40 hour traffic jam at england france border

france brexit revenge, heavy traffic jam france-britain border, brexit traffic, brexit france, dover traffic jam

Border checks strand British vacationers in 50 hour traffic jams for security but netizens says revenge for brexit only.

ITEMVIDEOS:నడిరోడ్డుపై నరకం చూస్తారా? అయితే ఇది మీకోసమే...

Posted: 07/25/2016 02:59 PM IST
40 hour traffic jam at england france border

ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ రోడ్లపై తిరిగే వారికి అనుభవపూర్వకమే. తుమ్మితే ఊడిపోయే రోడ్లకి  పొరపాటున వరుణుడు తోడైతే ఇక నరకమే. కానీ, వేల మంది రెండు రోజులుగా ట్రాఫిక్ లో ఇరుకున్నారు. ఒకటి కాదు  రెండు కాదు ఏకంగా 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్.  ఓ పక్క ఎండ వాత.. లోన ఉక్కపోత.. ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతం.  ఫ్రాన్స్-బ్రిటన్ సరిహద్దులో కనిపిస్తున్న పరిస్థితి ఇది.

బ్రిటన్- ఫ్రాన్స్ సరిహద్దులోని డోవర్ పట్టణంలో గడిచిన 50 గంటలుగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నీస్ ట్రక్కు దాడి తర్వాత అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసిన ఫ్రాన్స్.. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి చానెల్ టన్నెల్ మీదుగా ఫ్రాన్స్ వెళ్లాల్సిన వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో వాహనం తనిఖీకి 40 నిమిషాలు పడుతుండటంతో ఇప్పుడున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కే రెండు లేదా అంతకు మించి రోజుల సమయం పడుతుంది.

ఇక ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ బ్రిటన్ సరిహద్దును దాదాపు మూసేసినంత పని చేయడంతో బ్రిటిషర్లు భగ్గుమంటున్నారు. బ్రెగ్జిట్ కు ప్రతీకారంగానే ఫ్రాన్స్ ఇలా ప్రతీకారం  తీర్చుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు నెలకొన్న ట్రాఫిక్ క్లియర్ చేయాలంటేనే ఇంకో రెండు రోజులు పడుతుంది. మొత్తం 2,50,000 మంది ఈ నరక కుంపంలో ఇరుక్కున్నట్లు సమాచారం. బ్రిటన్ ప్రభుత్వం తన వంతుగా ప్రయాణికులకు 11వేల నీళ్ల బాటిళ్లను సరఫరా చేస్తోంది. అయితే ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రం చేతులెత్తేసింది. ఎందుకంటే ఆ పని చేయాల్సింది ఫ్రాన్స్ కాబట్టి!

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : France  Britain  border  traffic  40 hours  

Other Articles