ఒక్కోసారి దురదృష్టం వెంటాడితే.. తాడు కూడా పాముగా మారి కరుస్తుందంటారు. అలా దృరదృష్ట వంతులకు ఎదురైయ్యే పరిస్థితులను కామోడీగా మనకు ఇప్పటికే అనేక మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు చూపించారు. ఇంకా చూపిస్తూనే వున్నారు కూడా. అయితే అవన్నీ కేవలం దర్శకులు మార్కు కామెడీ అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఒకరి కష్టాన్ని హాస్యంగా మారుస్తారా అన్నవారు లేకపోలేదు. కానీ నిజంగా కూడా అలాంటి దురదృష్టవంతులు వుంటారని మీకు తెలుసా..?
ఇలాంటి ఓ దరదృష్ట యువకుడిని మీకు పరిచయం చేయాలని వుంది. ఎందుకంటరా..? తన మానాన తాను బస్సులో ప్రయాణిస్తుంటే.. ఓ యువతి అతడ్ని ఘోర పరాభావానికి గురిచేసింది. తన పాటికి తాను బస్సులో నిలబడి ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ యువతి అతడి ప్యాంటును లాగింది. మోకాళ్ల కిందకు జారీపోయిన ప్యాంటుతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సరేలే అని సర్దుకున్నా.. సీసీ కెమెరాల పుణ్యమా అని అతడి వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హాట్‌టాపిక్‌గా మారింది.
చైనాలోని వూ షాన్లులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. రక్షించుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది. అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఈ దృశ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వస్తున్నాయి. అయితే.. 'పాపం ఆ యువతి కావాలని లాగలేదు' అని కొందరు వెనుకేసుకొస్తున్నారు. అందరూ అమ్మాయిల గురించే అలోచిస్తే ఎలా.. తగలరాని చోట దెబ్బ తగిలిందో ఏమో యువకుడు అక్కడ నోప్పి అని అరుస్తుంటే పట్టించుకునే వారే లేరా.. అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు నెట్ జనులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more