దేశ రాజధాని ఢిల్లీలో ఓలా క్యాబ్ డ్రైవర్ వెనక సీటులో కూర్చున్న ఘటనను మరవక ముందే మరో కామాంధుడు అదే తరహాలో నేరానికి పాల్పడుతూ పట్టుబడ్డాడు. వీడి అకృత్యాలపై అనుమానం కలిగిన యువతి అతడి ఆటను సోషల్ మీడియా ద్వారా కట్టించింది. పద్థతిగా బొట్టు పెట్టుకుని పక్క పాపిట తీసి బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రంజిత్. బెంగళూరు సిటీలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పైకి కనించేంత బుద్ధిమంతుడు కాదని అతని చర్యలతో పట్టుబడ్డాక కానీ తెలియలేదు. అనుకోకుండా అతడి అటో ఎక్కిన యువతి చేతికి చిక్కి తప్పించుకున్నానని భావించాడు. మనం బయటపడ్డాం అని.. ఇక వాడి గొడవ మనకెందుకులే అనుకోకుండా ఆ యువతి అతడి వెకిలి చేష్టలను వివరిస్తూ.. ఆ యువతి సోషల్ మీడియాలో ఫోస్టులు పెట్టడంతో అడ్డంగా బుకయ్యాడు రంజిత్.
వివరాల్లోకి వెళ్తే.. అమ్మాయిలను ఆటోలో ఎక్కించుకుని వారిని అద్దంలో నుంచి దొంగచూపులు చూడటం, రహస్యంగా వీడియోలు తీయడం ఇతని అలవాటు. ఆ తీసిన వీడియోలను పదేపదే చూస్తూ, తన స్నేహితులకు చూపిస్తూ వికృతానందం పొందుతాడు. అటో ఎక్కిన యువతుల ఎద అందాలు తన ఫోన్ కెమరాలో చిక్కేలా ఈ మృగాడు పక్కా స్కెచ్ వేశాడు. ఆటోపైభాగంలో సరిగ్గా సీటులో కూర్చున్న వారు కనిపించేలా ఎవరికీ కనిపించకుండా స్మార్ట్‌ఫోన్ ఒకటి అమర్చాడు. ఆ స్మార్ట్‌ఫోన్ వీడియో రికార్డర్ కస్టమర్లు ఎక్కే సమయానికి ఆన్ చేసేవాడు. అమ్మాయిలు ఆటో ఎక్కగానే వారు కూర్చున్న దగ్గర్నుంచి ఆటో దిగే దాకా ప్రతీ కదలిక అందులో రికార్డ్ అవుతుంది. వారి దిగిన తరువాత వాటిని తనతో పాటు తన స్నేహితులకు చూపించి అనందించేవాడు.
అయితే వీడి పాపం పండింది. అందుకనే ఆకాంక్ష గౌతమ్ అనే యువతికి చిక్కాడు. అమె ఇతని గుట్టును బట్టబయలు చేసింది. ఇంతకీ ఈమెకెలా తెలిసిందంటే.. జూలై 24వ తేదీ ఆకాంక్ష గౌతమ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి తిరిగి వెళ్లడానికి బయల్దేరింది. బయట భారీవర్షం. సాయంత్రం 4.30 దాటింది. క్యాబ్స్ ఏవీ అందుబాటులో లేవు. అటుగా వస్తున్న ఆటోను ఆపింది. ఆ ఆటో రంజిత్‌ది. వెంటనే ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటో ఎక్కిన కొద్దిసేపటికి అతను అద్దంలో ఆమెను చూసి వెనక్కి తిరిగి నవ్వాడు. ఆకాంక్షకు అతనిపై అనుమానం కలిగింది. ఆటో కొంతదూరం వెళ్లగానే స్పీడ్ బ్రేకర్ల ధాటికి ఏదో వస్తువు పై నుంచి ఆకాంక్ష కాళ్ల దగ్గర పడింది. తీరా చూస్తే అది సెల్‌ఫోన్.
వీడియో మోడ్ ఆన్ చేసి ఉన్న ఆ మొబైల్ చూసి ఆకాంక్ష ఒక్కసారిగా షాకయ్యింది. అందులో తాన రికార్డింగ్ వుంది. దీంతో అతని మోసాన్ని పోలీసులకు చెప్పాలనుకుంది. కానీ ఆ ఆటోడ్రైవర్ ఆమె పట్టుకున్న ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ వీడియో సేవ్ కాకుండా డిలీట్ అయ్యింది. అయితే ఈ సీన్ జరిగే లోపే ఆకాంక్ష తన ఫ్రెండ్‌కు ఫోన్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది. ఆటో డ్రైవర్ దౌర్జన్యం చేస్తున్న సమయంలో ఆకాంక్ష స్నేహితురాలు వచ్చింది. అమె రాకతో అక్కడి నుంచి అటో డ్రైవర్ మెల్లిగా జారుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అంత ఈజీగా వదలకూడదని భావించిన అకాంక్ష వాడి వికృత చేష్టలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఎట్టకేలకు ఆ మోసగాడు జైలుకెళ్లి ఊచలు లెక్కెడుతున్నాడు. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆకాంక్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలాంటి వెధవలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more