EAMCET-2 paper leak: Telangana CID arrests 'kingpin', three others

Cid cracks ts eamcet 2 paper leak case accused is a repeat offendor

cid, Rajgopal Reddy, main conspirator, TS EAMCET-2 paper leak, Usha Education Bengaluru, Eamcet-II Paper Leak, Eamcet-II Paper, Telangana Eamcet-II Paper, Telangana Eamcet-II

The police were able to access the call data records of the brokers and compare them with that of the student’s parents.

తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ జరిగిందిలా..!

Posted: 07/27/2016 07:06 PM IST
Cid cracks ts eamcet 2 paper leak case accused is a repeat offendor

వైద్య విద్య అందులోనూ ఎంసెట్ ద్వారా నాలుగేళ్ల ఎంబిబిఎస్ కోర్పు చేయాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ఎందుకంటే అందుకయ్యే ఖర్చే ప్రధాన కారణం. అంతకన్నా అధికంగా పోటీలో పెద్ద సంఖ్యలో వుండే పోటీతత్వం కూడా మరోకారణం. అయితే ధీనిని క్యాష్ చేసుకునేందుకు పక్కా స్కెచ్ రచించిన ఘనులు.. పేపర్ ను లీక్ చేసి.. కోట్ల రూపాయలను దండుకున్నారు. ఇందుకు పేపర్ లీక్ చేసిన దగ్గర్నించి.. పేపర్ ను కొనుగోలు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల వరకు అందరినీ అడించింది మాత్రం డబ్బు. ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీక్ వీరికెలా సాధ్యమైంది..? అంటే..

అవకాశం ఎలా లభించింది..?

వైద్య విద్యతో పాటు అనుబంధ విద్యలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్షను నిర్వహించి ఒకే విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచించడంతో ఈ ఏడాది నీట్ పరిక్ష ద్వారా వైద్య పరీక్షలు కొనసాగుతాయని అందరూ భావించారు. అయితే నీట్ పరీక్షలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్ నుంచి రాష్ట్ర్ ప్రభుత్వాలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు కోర్టు తీర్పును వెలువరించింది. అంతే దాంతో తమకు మళ్లీ అవకాశం లభించిందని భావించిన ఘనులు ప్రశ్నాపత్రం లీక్ కు తెరతీసారు. కోట్ల రూపాయలను దండుకున్నారు.

ఢిల్లీ ముద్రణ కేంద్రం నుంచి పేపర్ లీక్

ఎంసెట్ 2 లీక్ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఢిల్లీలో ముద్రణ అవుతున్నాయన్న సమాచారాన్ని సేకరించిన ఘనులు.. ఏకంగా అక్కడే వాలిపోయారు. ముద్రణ కేంద్రంలో కీలక వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఈ లీక్ వ్యవహారంలో దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు డీల్ కుదిరింది. ఈ నెల 9న జరిగిన ఎంసెట్ 2 పరీక్ష నేపథ్యంలో రెండు రోజులు ముందుగానే అంటే సుమారు 7వ తేదీన పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఢిల్లీ నుంచి ఎగురుకుంటూ వచ్చిన ఘనులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని ముంబై, బెంగుళూరుకు రమ్మన్నారు., అక్కడి వచ్చిన దాదాపు 70 నుంచి 75 మంది విద్యార్థులకు అక్కడే ప్రశ్నాపత్రాల జిరాక్స్ ఇచ్చి వాటిని ఎలా రాయాలదన్న విషయమై కూడా శిక్షణను ఇచ్చారు. అందుకుగాను ఓక్కో విద్యార్ధి నుంచి 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు దండుకున్నారు.

ఈ లీక్ వ్యవహారం ఎలా బయటపడిందంటే.?

ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమంది విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్లో వందల్లోనే ర్యాంకులు రావడంతో మొదలైన అనుమానం.. చివరకు డొంక మొత్తాన్ని కదిలించింది. దాంతో ఈ బాగోతం అంతా బయటపడింది. తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కొంతమంది తల్లిదండ్రులు తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆశ్రయించారు. దీనికి తోడు ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి. దీనిపై ప్రభుత్వం ఎంసెట్ కన్వీనర్ రమణారావు కూడా శాఖాపర దర్యాప్తు చేయాలని అదేశించింది. ప్రాథమిక దర్యాప్తులో అరోపణలు పెద్ద ఎత్తున రావడంతో ప్రభుత్వం సీఐడీకి కేసును అప్పగించింది.

రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఈ కేసులో కూపీ లాగడం మొదలుపెట్టారు. గతంలో జరిగిన పీజీ సెట్‌ కీలక నిందితుడి ద్వారానే ఈ స్కాం జరిగినట్లు సీఐడీ అధికారులకు ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. ర్యాంకులు వచ్చిన పిల్లల తల్లిదండ్రుల కాల్ డేటా కూడా చూస్తే రెండూ కలిశాయి. వాళ్లిద్దరు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. జేఎన్టీయూ సిబ్బంది ఇద్దరి పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలిసింది. లీకేజి స్కాం విలువ 50 కోట్లు, కాగా.. మొత్తం 74 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ముఖ్యమం‍త్రి కేసీఆర్కు డీజీపీ అందజేసినట్లు సమాచారం.

ఇంతకీ ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీక్ ఎవరి పని..?

తెలంగాణ ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీక్ కొత్త వారి పని కాదు. ఏకంగా పాత లీకు వీరుల పనేనని సిఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. 2014లో మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీక్ చేసిన ఘనుడే ఈ సారి తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ పేపర్ ను లీక్ చేశాడు. అతను మరెవరో కాదు రాజగోపాల రెడ్డి. అప్పట్లో అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు. అయితే జైలుకెళ్లినా.. ఈ ఘనుడి బుద్ది మాత్రం మారలేదు. అతనే తాజాగా తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీక్ లోనూ కీలక నిందితుడని సీఐడీ నిర్ధారించింది.

ఈ విషయంలో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గతంలో నిందితుడైన రాజగోపాలరెడ్డితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారీ రమేష్లతో పాటు.. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో విష్ణుకు ఒక కన్సల్టెన్సీ ఉంది. దాని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజిమెంటు కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకునేవాడని అంటున్నారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారని, వాళ్లు పరారీలో ఉన్నారని సమాచారం.

బెంగళూరు కేంద్రంగా నడిచిన లీక్ వ్యవహారం

తెలంగాణ లీక్ వ్యవహరం మొత్తం బెంగళూరు కేంద్రంగా నడిచింది. రాజగోపాలరెడ్డి (63) ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజిమెంట్ కోటాలో వైద్యసీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరించేవాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పేపర్ల ముద్రణ జరుగుతుందని ముందే తెలిసిన రాజగోపాలరెడ్డి.. హైదరాబాద్లో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లలో బాగా స్థితిమంతులైన పిల్లల వివరాలు సేకరించి, వాళ్ల తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రధానమైన పరీక్షలకు మూడు సెట్ల పేపర్లను సిద్ధం చేస్తారు. ఏ సెట్ను ఉపయోగించేదీ ఆరోజు ఉదయమే ప్రకటిస్తారు. అందుకే మొత్తం మూడు సెట్ల పేపర్లనూ లీక్ చేయించాడు. ఏ సెట్ వచ్చినా వాటిలోని ప్రశ్నలన్నీ తెలుసు కాబట్టి.. సులభంగా ర్యాంకులు సాధించేలా ఆ విద్యార్థులను రెండురోజుల పాటు బెంగళూరులో సిద్ధం చేశారు. సరిగ్గా పరీక్షరోజు ఉదయమే వాళ్లను విమానాల్లో హైదరాబాద్ రప్పించారు. దాంతో ముందు అనుకున్నట్లుగానే మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో లీక్ వ్యవహారం వెలుగుచూసింది,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cid  Rajgopal Reddy  main conspirator  TS EAMCET-2 paper leak  Usha Education Bengaluru  

Other Articles