Eamcet-2 may be cancelled, if we go by norms: Telangana minister

Telangajna government to cancel ts eamcet 2 exam

cid, Rajgopal Reddy, main conspirator, Telangana minister, C. Laxma Reddy, TS EAMCET-2 paper leak, Usha Education Bengaluru, Eamcet-II Paper Leak, Eamcet-II Paper, Telangana Eamcet-II Paper, Telangana Eamcet-II

If we go by norms, cancellation is inevitable in case of a question paper leakage, says Minister C. Laxma Reddy.

తెలంగాణ ఎంసెట్ 2 రద్దుకు ప్రభుత్వం మొగ్గు..

Posted: 07/28/2016 07:14 AM IST
Telangajna government to cancel ts eamcet 2 exam

వైద్య విద్య సహా దాని అనుబంధ కోర్సుల ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 లీక్ అయ్యిందని పక్క ఆధారాలు లభ్యం కావడంతో ఇక ఆ పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇవాళ అధికారికంగా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తుంది. ముందునుంచి పేపర్ లీక్ పై వార్తలు వస్తున్నా.. సిఐడీ విచారణ జరుపుతుంది కాబట్టి.. ఆ దర్యాప్తు సంస్థ నివేదిక అందిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికీ ఎంసెట్ రద్దు చేసే యోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి కూడా సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే విద్యార్థుల కోసం ఎంసెట్ 3 పరీక్షను నిర్వహించాల్సి వుందని కూడా ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖరరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైన తరువాత హెల్త్‌ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్‌-2పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో పరీక్షను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎంసెట్‌-3 కోసం ప్రత్యేకంగా మళ్లీ నోటిఫికేషనను జారీచేసే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cid  C. Laxma Reddy  Rajgopal Reddy  TS EAMCET-2 paper leak  Usha Education Bengaluru  

Other Articles