పెళ్లైన తరువాత వేదికల పైన వివిధ స్టిల్స్ లో వదువరులను ఫోటోలకు ఫోజులివ్వమని మన వివాహాల్లో ఫోటోగ్రాఫర్లు కోరుతుండటం పరిపాటి. అయితే కొన్ని దేశాలలో పెళ్లికి ముందే కాబోయే వధువరులను ఓ ప్రత్యేక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ వారి స్టాయికి తగ్గట్లుగా ఫోటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని ఫోటలో దిగుతుంటారు. అయితే ఇలాంటి ఓ వెడ్డింగ్ షూట్ లో ఒకింత ఆవకాశం కలసివచ్చిందనుకున్న వదువును ఫోటో తీశాడు ఫోటోగ్రాఫర్. అయితే ఆయన అల్లంత దూరాన వుండటం కారణంగా అవకాశం అనుకున్నది కాస్తా ప్రాణాపాయంగా మారింది. ఏకంగా వదువు ప్రాణాలమీదకు తెచ్చింది.
ఐస్ లాండ్ లో చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఓ కొత్త జంట పెళ్లిఫొటోలు తీయాల్సిందిగా ప్రపంచంలో బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లలో ఒకరైన సీఎం లెంగ్ ను కోరారు. ఆమేరకు అందరూ కలిసి ఐస్ లాండ్ కు వెళ్లారు. వివిధ పర్యాటక ప్రాంతాలు, రమణీయ ప్రదేశాల్లో వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశాడు లెంగ్. ఆఖర్లో ఓ నదీతీరంలో జరిగిన ఫొటోషూట్ మాత్రం ప్రమాదకరంగా మారింది. నదీ తీరంలో హెలికాప్టర్ బ్యాగ్రౌండ్ లో ఫొటో తీయాలనుకున్న లెంగ్.. ఐర్లాండిక్ కోస్టల్ గార్డ్ హెలికాప్టర్ ఒకదానిని అద్దెకు తీసుకున్నాడు.
పాల నురగలాంటి పెళ్లి దుస్తుల్లో వెయిల్ పట్టుకుని నిల్చున్న పెళ్లి కూతురుపై నుంచి హెలికాప్టర్ వెళుతుండగా ఫొటోలు చిత్రీకరించాల్సిఉంది. అయితే హెలికాప్టర్ సరాసరి తలపైకి వచ్చేసరికి.. రెక్కల గాలి ఉధృతికి వధువు చిగురుటాకులా వణికి, కిందపడబోయింది. ఆమె ధరించిన వెయిల్ అమాంతం ఎగిరి హెలికాప్టర్ రెక్కల్లో ఇరుక్కుంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోరప్రమాదం తప్పినట్లైంది. ముఖాన దుమ్ము, చెరిగిన జుట్టుతో ఆ పెళ్లికూతురికి ఏడుపొక్కటే తక్కువ! ఇంతటి ప్రమాదకర స్థితిలోనూ అద్భుతమైన ఫొటోలు తీసీ కొత్తజంట కోపాన్ని సంతోషంగా మార్చేశాడు ఫొటోగ్రాఫర్ సీఎం లెంగ్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more