Telangana government cancels eamcet 2 exams

Telangana cm cacels eamcet 2 exam

telangana cm, KCR, cid, TS EAMCET-2 paper leak, Eamcet cancelled, cid, Rajgopal Reddy, main conspirator, Telangana minister, C. Laxma Reddy, TS EAMCET-2 paper leak, Usha Education Bengaluru, Eamcet-II Paper Leak, Eamcet-II Paper, Telangana Eamcet-II Paper, Telangana Eamcet-II

The twists and turns in Eamcet-II leakage and the fear of exam being cancelled is sending several rankers into a state of dejection.

ఎంసెట్ 2 రద్దు.. నిబంధనలకే ప్రభుత్వం మొగ్గు

Posted: 07/29/2016 08:59 PM IST
Telangana cm cacels eamcet 2 exam

వైద్య విద్య, అనుబంధ విద్య ప్రవేశ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ కావడంతో దానిపై దర్యాప్తు జరిపిన సీఐడీ.. కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ప్రభుత్వానికి ఇవాళ ఉదయం నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారికంగా మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

దీంతో ఇప్పటివరకు మెడికల్ కోర్సుల కోసం దాదాపు ఐదు ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులంతా మరోసారి ప్రవేశపరీక్ష రాసి తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున ఇంకా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే.. పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇది 56 వేలమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. రద్దు చేయడం తగదన్న వాదనలు గట్టిగా వినిపించినా నిబంధనల మేరకు రద్దు చేయక తప్పదన్న వాదనలకే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు సమాచారం.

పేపర్ లీకైన నేపథ్యంలో పరీక్ష రద్దుచేయాలని న్యాయ నిపుణులు సూచించడంతో ఈ విషయంలో తీవ్ర తర్జనభర్జనలు ఎదుర్కోన్న ప్రభుత్వం ఎట్టకేలకు పరీక్ష రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికిప్పుడైనా రద్దుచేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారానే ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లను జారీచేసి, ఆగస్టు మొదటివారంలో పరీక్ష నిర్వహించి, రెండోవారంలో ఫలితాలు ప్రకటించి సెప్టెంబర్ నాటికే తరగతులు ప్రారంభిస్తే విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana cm  KCR  cid  TS EAMCET-2 paper leak  Eamcet cancelled  

Other Articles