అరెస్టయిన ఆప్ నేతలపై ఏం కేసులు ఉన్నాయంటే | Arrested AAP MLAs crime history.

National media on aap 12 arrested mlas crime list

AAP MLAs crime history, Lawmakers or law breakers, AAP MLAs womanizers, Delhi shake with corrupt list

National media stories on AAP arrested MLAs. Lawmakers or law breakers? As many as 12 AAP MLAs arrested in past one year!

సామాన్య నేతల హీనమైన చరిత్ర

Posted: 08/01/2016 03:08 PM IST
National media on aap 12 arrested mlas crime list

ఆప్ ఎమ్మెల్యేల యవ్వారం రాను రాను ముదిరిపోతుంది. ప్రతీకార చర్యలోనే భాగంగా మోదీ సర్కార్ తమపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం
కేజ్రీవాల్ చెబుతున్నప్పటికీ పక్కా ఆధారాలతోనే తాము ముందుకు వెళ్తున్నామని పోలీసులు పేర్కొనటం గమనార్హం.

నభూతో నభవిష్యత్ అన్న చందాన ఢిల్లీ పీఠాన్ని రెండోసారి దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకున్న తర్వాత, గడచిన ఏడాది వ్యవధిలో 12 మంది ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. తమ నేతలను కుట్ర
పూరితంగా కేంద్రం అరెస్ట్ చేయిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొన్ని కేసులు చాలా తీవ్ర ఆరోపణలతో కూడినవి ఉన్నాయి. ప్రజా ప్రతినిధులుగా
ఎన్నికైన వీరు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జాతీయ మీడియా ఏకిపడేస్తూ కథనాలు వెలువరించింది. అందులో వారి నేర చిట్టాను వివరించింది.

ఈ నేపథ్యంలో అరెస్టయిన ఆప్ ఎమ్మెల్యేలపై ఏమేం కేసులు ఉన్నాయో పరిశీలిస్తే...

1. అమానతుల్లా ఖాన్: ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. జూలై 24న అరెస్ట్ అయి, జైలుకు వెళ్లి ఆపై బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు.
2. సోమనాథ్ భారతి: తనను గృహ హింసకు గురి చేస్తున్నాడని స్వయంగా సోమనాథ్ భార్య ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 2015లో ఒకసారి, ఓ యువతిపై దాష్టీకానికి దిగాలని తన            మద్దతుదారులను కోరుతున్న వీడియోలు బయటపడటంతో గత నెలలో మరోసారి అరెస్టయ్యారు.

3. సురీందర్ సింగ్: సైనికాధికారి అయిన ఈయన ఓ ఎన్డీఎంసీ ఉద్యోగిపై అందరూ చూస్తుండగానే చెయ్యి చేసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

4. దినేష్ మోహానియా: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, 60 సంవత్సరాల వృద్ధుడిని కొట్టిన కేసులో అరెస్ట్ అయి, ఆపై బెయిల్ తెచ్చుకున్నారు.

5. రాజేష్ రిషీరిషీ: జనక్ పురి ప్రాంతానికి చెందిన ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో సాక్ష్యాలు లభించడంతో జూలై 26న అరెస్టయ్యారు. ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది.

6. నరేష్ యాదవ్: మలీర్ కోటా పట్టణంలో పర్యటిస్తున్న వేళ ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ ను అవహేళన చేశారన్న ఆరోపణలపై జూలై 24న అరెస్టయ్యారు.

7. మహీందర్ యాదవ్: దోపిడీ, ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం వంటి ఆరోపణలతో ఈ సంవత్సరం జనవరిలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆపై బెయిల్ తెచ్చుకున్నారు.

8. అఖిలేష్ త్రిపాఠి: 2013లో నమోదైన దోపిడీ, నేరపూరిత కుట్ర కేసులో నవంబర్ 2015లో పోలీసులు అరెస్ట్ చేశారు.

9. జితేందర్ సింగ్ తోమర్: తప్పుడు విద్యా పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలను ఎదుర్కొన్నారు. డిగ్రీ చదవకుండానే చదివినట్టు సర్టిఫికెట్లు సృష్టించినట్టు తేలడంతో జూన్ 2015లో అరెస్టయ్యారు.

10.మనోజ్ కుమార్: ఢిల్లీ మహిళా కమిషన్ కు మనోజ్ భార్య ఫిర్యాదు చేయగా, జూలై 2015లో అరెస్టయ్యారు. ఓ భూదందా కేసు కూడా ఈయనపై ఉంది.

11. ప్రకాశ్ జర్వాల్ : మహిళను వేధించటంతోపాటు ఆమెపై చేయి వేశాడంటూ జూన్ లో ఆయనను అరెస్ట్ చేశారు.

12. శరద్ చౌహాన్: ఆప్ లో ఎదగాలంటే శీలంపై మక్కువ వదులుకోవాలని యువతితో వ్యాఖ్యానించినట్టు ఆరోపణ. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో చౌహాన్ ను జూలై 31న అరెస్ట్ చేశారు.

వీరిలో ఎక్కువ మందిపై మహిళా వేధింపుల కేసులు నమోదు కావటం విశేషం. పక్కా ఆధారాలతో వీరిని అరెస్ట్ చేయగా, ఆప్ ఏమో వీటిని తప్పుడు కేసులు అంటోంది. వీరు లా మేకర్స్ కాదని, లా బ్రేకర్స్ అంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో సమర్థవంతమైన పాలన అందిస్తానని హామినిచ్చిన కేజ్రీవాల్ గొంతులో పచ్చివెలగకాయ పడినట్లయ్యింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Aravind Kejriwal  12 MLAs  arrested  

Other Articles