గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ రాజీనామా | Gujarat CM Anandiben Patel offers to resign

Gujarat cm anandiben patel offers to resign

Anandiben Patel offers to resign, Gujarat CM Anandiben Patel, Anandiben Patel age factor, Posting her resignation letter on Facebook

Gujarat CM Anandiben Patel offers to resign.

రాజీనామాకు సిద్ధపడ్డ గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్

Posted: 08/02/2016 07:42 AM IST
Gujarat cm anandiben patel offers to resign

గుజరాత్ ముఖ్యమంత్రి అనందీబెన్ పటేల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. వయసు మీదపడడంతో ముఖ్యమంత్రి బాధ్యతలు మోయలేకపోతున్నానని, బాధ్యతల నుంచి తప్పించాలని అనందీబెన్ పటేల్ బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఆమె తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

కాగా, న‌రేంద్ర‌మోదీ ప్ర‌ధాని కావ‌డంతో 75 ఏళ్ల ఆనందీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మే 22, 2014లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం రాష్ట్రంలోని పటేళ్ల ఉద్యమం ఆమెను ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఉద్యమం తీవ్రతరం కావడంతో అనందీబెన్ పటేల్ పై ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పార్టీ అధిష్ఠానం నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఈ దశలో అనందీ బెన్ పటేల్ పని తీరుపై బీజేపీ గుర్రుగా ఉన్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి గుజరాత్ ముఖ్యమంత్రి మారనున్నారని, రేసులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ఆ సందర్భంలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆమె తాజా వ్యాఖ్యలతో గుజరాత్ బీజేపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇక ఆమె పంపిన రాజీనామా లేఖ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్ఠానానికి చేరింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు.  తాజాగా గుజ‌రాత్‌లో ద‌ళితుల‌పై దాడి అంశం ఆమెపై ఒత్తిడి పెంచిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్ఠానం కొత్త‌ ముఖ్య‌మంత్రిని నియ‌మించే అవ‌కాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  CM Anandiben Patel  BJP  Amit Shah  

Other Articles