బీజేపి అధిష్టానం తాను తలచిన దానినే క్రమంగా ఆమలుపర్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం నుంచి ఆనందీ బెన్ పటేల్ ను తొలగిస్తారని కొంతకాలం జరుగుతున్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. అమెను పదవి నుంచి తప్పించేదుకు ఏజ్ లిమిట్ అనే కొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చిన బీజేపి అధిష్టానం.. అమెను తాము తొలిగించడం కంటే.. తనకు తానుగానే ఆ పదవిని తప్పుకుంటే గౌరవంగా వుంటుందని చెప్పి బజేపి అధిష్టానం తెరవెనుక ఒత్తిడి చేయడంతో అమె ఎట్టకేలకు తన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంది.
అయితే తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఆనందీ బెన్ పోస్ట్ చేశారు. వయోభారం కారణంగా తాను సీఎం బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నానని… తన స్థానంలో యువతకు చోటు కల్పించాలని ఆమె కోరారు. తన రాజీనామా లేఖను గుజరాత్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి అందించారు. ఆమె రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించిందని తెలుస్తోంది. గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా నితిన్ భాయ్ పటేల్ ను ఎంపిక చేయాలని మోదీ అమిత్ షా ఇదివరకే నిర్ణయించారని… త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా ప్రధాని పదవికి నరేంద్రమోడీ ఎంపికైన తరువాత ఆ పదవీ బాధ్యతలను చేపట్టిన అనందిబెన్ పటేల్ పదవి నుంచి తప్పుకోవడంతో గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నితిన్ భాయ్ పటేల్, సౌరబ్ పటేల్, విజయ్ రూపాణి పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. గుజరాత్లో బలమైన పటేల్ సామాజికవర్గ నాయకుడినే సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో గుజరాత్ బీజేపి అధ్యక్షుడిగా వున్న విజయ్ రూపానీ పేరే ఈ రేసులో ప్రముఖంగా వినబడుతుంది.
ఇక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన ఆనందీ బెన్ పటేల్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఆనందీ బెన్ పటేల్ రాజీనామా వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ఆనందీ బెన్ ఆధ్వర్యంలో ఎదుర్కోలేమని… అంతకుముందే ఆమెను మార్చాలని మోదీ-షా జోడి భావిస్తోంది. పటేళ్ల ఉద్యమాన్ని డీల్ చేసే విషయంలో ఆనందీ బెన్ పటేల్ సరిగ్గా వ్యవహరించలేదని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ… అప్పటి నుంచి ఆమెను తప్పించాలనే ఆలోచనతో ఉన్నట్టు బీజేపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆనందీ బెన్ పటేల్ రాజీనామా తరువాత గుజరాత్ రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పకతప్పదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more