మద్యం మత్తులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తానేం చేస్తుందన్న విచక్షణ కోల్పోయిన తనకు తాగేందుకు మరింతగా మద్యం ఇవ్వలేదని షాపు నిర్వాహకులపై ఆగ్రహంతో ఊగిపోయింది. దుకాణానికి చెందిన సరుకులను చిందరవందరగా రోడ్డుపై పడేసింది. షాపు సిబ్బందిని నోటికోచ్చినట్టు తిట్టింది. వారిపై జాతివివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన తూర్పు లండన్‌లో జరిగింది. దీంతో అమెను గుర్తించేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు లండన్ బెథ్నాల్ గ్రీన్‌లోని "ఫ్రెష్‌గో' షాపులో ఓ నల్లజాతి యువతి ఇలా చిందులు తొక్కింది. ఆ షాపులోని వస్తువులను చిందరవందరగా పారేసింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ షాపులోని ఆసియా సంతతి వ్యక్తులపై జాత్యాంహకారపూరితమైన వ్యాఖ్యలు చేసింది. వారిని నానా దుర్భాషలాడింది. తనకు మరింత మద్యం ఇచ్చేవరకు షాపులోపలికి ఎవరినీ రానీయనంటూ తలుపులు మూసేసి నానా బీభత్సం సృష్టించింది.
తమ దుకాణం సిబ్బంది అమెతో శాంతంగా వ్యవహరించినా. అమె పూనకంతో ఊగిపోయింది. దుకాణం సిబ్బంది అమె విసిరిన వస్తువులను తీసుకొచ్చి వరుస క్రమంలో పెట్టారు. అయితే అక్కడి నుంచి మరో వైపు వెళ్లిన అమె అక్కడున్న వస్తువులను కిందపడేసింది. దీంతో షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలిని గురించి పోలీసులు గాలిస్తున్నారు. నిందితురాలు 20 ఏళ్లకుపైగా వయస్సున్న నల్లజాతి యువతి అని, 5.5 అడుగుల ఎత్తు ఉండి దృఢంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె వీరంగం సృష్టించిన సీసీటీవీ వీడియో దృశ్యాలను విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more