ప్రత్యేక హోదా కోసం పోరుబాట మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మంగళవారం కూడా దానిని కొనసాగిస్తున్నారు. రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మరీ టీడీపీ, వైసీపీ ఎంపీలంతా నిన్న పార్లమెంటు లోపలా, బయటా నిరసనలతో హోరెత్తించగా, నేడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన లోక్ సభలోకి నిన్నటి మాదిరే ప్లకార్డులు చేతబట్టుకుని వచ్చిన టీడీపీ ఎంపీలు ‘హోదా’ నినాదాలతో హోరెత్తించారు.
ఓవైపు హోదా ప్రకటించాలంటూ వైసీపీ ఎంపీలు వెల్ లోకి వెళ్లితే, టీడీపీ ఎంపీలు చర్చకు అనుమతించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అందుకు నిరాకరించడంతో వారు కూడా వెల్ లోకి దూసుకెళ్లి వైసీపీ ఎంపీలతో కలిసి నినదించారు. ప్రారంభమైన వెంటనే లోక్ సభలో గందరగోళం నెలకొని సభ వాయిదా పడింది.
సమావేశాలకు ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విడివిడిగా ధర్నాకు దిగిన సందర్భంగా ఇరు పార్టీల ఎంపీలు ఏపీకి ప్రత్యేక ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ముందుగా అక్కడికి చేరుకున్న వైసీపీ ఎంపీలు నినాదాలు చేస్తుండగా, అంతలో తోట త్రిమూర్తులు నేతృత్వంలో అక్కడికి చేరుకున్న టీడీపీ ఎంపీలు వారితో జత కలిశారు. ఆ తర్వాత కాసేపటికి వైసీపీ ఎంపీలు అక్కడి నుంచి వెళ్లిపోగా, టీడీపీ ఎంపీలు మాత్రం ఆందోళన కొనసాగించారు. మొత్తానికి నిన్నటి నుంచి కలిసి ఉంటూ ఓసారి, విడివిడిగా మరోసారి ఆయా పార్టీల ఎంపీలు హోదా నినాదాలు చేస్తుండటం పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేకంగా కనిపించింది.
ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, ఏపీతో పాటు అటు ఢిల్లీలోనూ కాక పుట్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తన నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నల్లబ్యాడ్జీ పెట్టుకుని మరీ ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. సభలోకి వెళ్లే ముందు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారు. మొత్తానికి ఏ ఒక్క ఎంపీకి కూడా రాని ఆలోచనతో ముందుకు సాగిన కేవీపీకి అధికార పార్టీ టీడీపీతో పాటు విపక్షం వైసీపీ కూడా చచ్చినట్లు మద్దతు తెలపక తప్పలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more