ప్రత్యేక హోదా విషయంలో మిత్రపక్ష ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పి బయటికి వచ్చేసి పోరాడాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఏపీ అధికార పక్షానికి అన్ని పార్టీలు వార్నింగ్ ఇస్తున్నాయి. అస్సలు ఇచ్చే పరిస్థితి లేదంటూ ప్రకటన చేసినా ఇంకా ఎందుకు పట్టుకుని వెళాడుతున్నారంటూ సీఎం చంద్రబాబు పై విమర్శలకు దిగుతున్నాయి. వీటిలో ప్రతిపక్ష అధినేత గొంతుక కూడా ఉంది.
అయితే టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బయటికి రాగానే జగన్ వైఎస్సార్సీపీ బీజేపీతో దోస్తీ కడుతుందట. ఆ ఫ్లాన్ తోనే జగన్ ముందుకు సాగుతున్నాడంట. ఈ మాటలు అంటుంది ఎవరో కాదు... చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్. చాలా రోజుల తర్వాత ప్రతిపక్షం, దాని అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చాడు లోకేష్.
ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని జగన్ పక్కదారి పట్టించి, జనాల్లో లేనిపోనివి సృష్టిస్తున్నాడు. ప్రత్యేక హోదా అన్నది చాలా కీలకమైన విషయం. ప్రభుత్వంలో మేమూ భాగస్వాములమే. అలాగని అన్యాయం జరగకుండా పోరాడాల్సిన భాద్యత మాపై ఉంది. కేంద్రం నుంచి బయటికి వచ్చేయమని జగన్ మాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఎందుకు ఒకవేళ మేము బయటికి వస్తే ఆ స్థానే ఆయన వచ్చి చేరతారేమో అంటూ సెటైరిక్ గా వ్యాఖ్యానించాడు. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం టీడీపీ పోరాడి తీరుతుందని లోకేష్ ఉద్ఘాటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more