అందమైన అమ్మాయిలను ఎరగా వేసి హైటెక్ వ్యభిచారాన్ని నడిపిస్తున్న ఉదంతాలు రాను రాను పెరిగిపోతున్న క్రమంలో చెన్నై లో వెలుగుచూసిన ఓ సెక్స్ రాకెట్ ను చూసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా చేసుకుని అమ్మాయిలను ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో జీతాలిస్తూ దీనిని నిర్వహిస్తున్నారు. ఏదో ఉద్యోగాల మాదిరి నెలవారీ లెక్కన వారిని ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి, బడా బాబుల దగ్గరికి పంపిస్తూ ఈ దందాను కొనసాగిస్తున్నారు.
ఎలా వెలుగు చూసింది:
కోల్ కతాకు చెందిన 19 ఏళ్ల యువతిని ఇలా బ్రోకర్లు ఓ యువ వ్యాపారవేత్తకు సప్లై చేశారు. అయితే సుఖం పేరుతో దారుణంగా హింసించడంతో ఆ అమ్మాయి చనిపోయింది. ఎంతో కొంత తీసుకుని ఈ విషయాన్ని మరిచిపోవాలంటూ ఆమె కుటుంబ సభ్యులకు బ్రోకర్లు ఆఫర్ చేశారు. అయితే అందుకు ఏ మాత్రం నిరాకరించని వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లేడీ సీఐ బుల్లెట్ రాజేశ్వరి, శంకర్ నారాయణన్ నేతృత్వంలోని బృందం బ్రోకర్లను అదుపులోకి తీసుకుని విచారించగా, వారిచ్చిన సమాచారంతో ఓ ప్రముఖ హోటల్ పై, అనంతరం అక్కడ లభించిన ఆధారాలతో ఎంఆర్సీ నగర్ లోని ఓ ప్రముఖుడి ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ నలుగురు యువతులను, దిలీప్ సింగ్ ఫైజల్ అనే మధ్యవర్తిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు.
విచ్చల విడిగా డబ్బు:
ముంబై, కోల్ కతాతో పాటు ఛండీఘర్, సిమ్లా తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వారికి నెలకు రూ.7లక్షలు జీతంగా చెల్లించి దీనిని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం భారీగానే బ్రోకర్లకు ముట్టజెప్పుతున్నారు బిజినెస్ మెన్ లు. చాలా కాస్ట్ లీ జరిగే ఈ వ్యవహారంలో అమ్మాయిలను విమానాల్లో మాత్రమే తిప్పుతుంటారు బ్రోకర్లు. మల్టీమిలీనియర్లను టార్గెట్ చేస్తూ ఫైవ్ స్టార్ హోటల్స్, లేదా వారి వారి ఇళ్ల వద్దకే పంపుతారట. ఒక్క నైట్ నుంచి వారం దాకా ఆ అమ్మాయితో గడిపటంతోపాటు వారి కోసం అదనంగా కూడా చాలానే ఖర్చుపెడతారని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తామని, కారుల్లో పంపుతుంటామని విచారణలో వీరు తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మిగతా నగరాల్లో కూడా ఇలాంటి దందాలే జరుగుతున్నాయని అనుమానంతో ఆయా రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more