Congress leader Yadagiri shot by unknown assailants in Hyderabad

Congress leader yadagiri shot at six times in telangana

Telangana, Congress, Yagagiri, Bowenpally, unknown assailants, Alwal, Land Disputes, Secunderabad, gangster Nayeem, rowdy sheeter dakkala babu, cctv footage, cp mahender reddy

Congress leader Yadagiri has been injured after being shot at by a bike-borne assailant. The incident happened in Bowenpally in Secunderabad. Yadagiri was hit by six bullets.

బోయిన్‌పల్లిలో కాల్పుల కలకలం.. కాంగ్రెస్ నేతకు గాయాలు..

Posted: 08/13/2016 02:21 PM IST
Congress leader yadagiri shot at six times in telangana

మహాబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ తో హడలిపోయిన తెలుగు ప్రజలు అతని దురాగతాలు, అక్రమాస్థులు, అయుధాలు, అగడాలు అన్ని వెలుగులోకి రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్న తరుణంలోనే తాజాగా సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో కాల్పుల కలకలం రేగింది. మల్లికార్జుననగర్‌లో కాంగ్రెస్ నేత యాదగిరిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు యాదగిరిపై అతిసమీపం నుంచి ఆరు రౌండ్ల మేర కాల్పులు జరిపారు. ఈ దాడిలో యాదగిరి శరీరంలోకి మూడు బుల్లట్టు దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. తీవ్రంగా గాయపడిన అతడిని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
 
ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే వుందని, అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. గత కొద్దిరోజులుగా లావాదేవీల విషయంలో యాదగిరి, ప్రస్తుతం కాల్పులు జరిపిన దుండగుల మధ్య పరస్పరం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల అనంతరం దుండగులు బైక్‌పై మెదక్ మీదుగా వెళ్లినట్లు సమాచారం. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.

కాగా ఇదే సమయంలో యాదగిరిపై కాల్పులు జరిపింది తామేనంటూ ఇద్దరు దుండగులు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఇదిలా వుండగా, యాదగిరిపై కాల్పులకు తెగబడింది రౌడీషీటర్ డక్కల బాబు అని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ మహేందర్‌రెడ్డి, డీసీపీ సుమతి పరిశీలించారు. కలకలం రేపుతున్న ఈ ఘటనపై విచారణ చేపట్టారు. యాదగిరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. యాదగిరి శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారని సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలంలో రెండు తూపాకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అల్వాల్ ప్రాంతంలో ఓ భూవివాదమే ఈ కాల్పులకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Congress  Yagagiri  Bowenpally  unknown assailants  Alwal  Land Disputes  Secunderabad  

Other Articles