dont have any relation with rowdy sheeter babu: congress leader yadgiri

Dont know why rowdy sheeter babu targeted me yadgiri

Telangana, Congress, Yagagiri, Bowenpally, unknown assailants, Alwal, Land Disputes, Secunderabad, gangster Nayeem, rowdy sheeter dakkala babu, cctv footage, cp mahender reddy

Congress leader yadagiri says he have no relation with rowdy sheeter babu, who shoot at him yesterday in bowenpally secundrabad.

బాబుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు: కాంగ్రెస్ నేత యాదగిరి

Posted: 08/14/2016 02:59 PM IST
Dont know why rowdy sheeter babu targeted me yadgiri

తనపై కాల్పులు జరిపిన బాబుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాల్పులకు గురైన నగరంలోని బోయిన్ పల్లి కి చెందిన కాంగ్రెస్ నాయకుడు దండుగుల యాదగిరి అన్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ప్రాణాహాని తొలగిందని వైద్యులు చెప్పారు. బుల్లెట్ హార్ట్ పక్క నుంచి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ అని రేపు 10గంటలకు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాల్పులకు గురైన యాదగిరి మీడియాతో మాట్లాడారు.

అసుపత్రిలో తనపై కాల్పులు జరిపిన డాకుల బాబుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడి బావమరిది మాత్రం ఎప్పుడైనా డబ్బులు కావాలంటే తన వద్దకు వచ్చి తీసుకునే వాడని చెప్పారు. అసలు బాబు తననెందుకు టార్గెట్ చేశాడో కూడా తనకు తెలియదని అన్నారు. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన తనకు.. తనను టార్గెట్ చేసేందుకు తన కుటుంబసభ్యులకు ఆగంతకులు ప్రాణహాని తలపెట్టవచ్చిన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు.

కాల్పులు జరిగే సమయంలో ఆస్పత్రిలో బాత్ రూమ్ లో దాక్కున్నానని, ఆ సమయంలో బాత్ రూమ్ పై గన్ పెట్టి తన తలపై షూట్ చేయబోయాడని చెప్పారు. ప్రతిఘటించి గన్ లాక్కున్న తర్వాత 100కి కాల్ చేశానని, కాసేపట్లో ఆస్పత్రి సిబ్బంది బయటకు రావడంతో తాను బయటకు వచ్చానని చెప్పాడు. పోలీసులకు చూపిద్దామని తన వెంటే గన్ ఉంచుకున్నానని అన్నారు. తెలిసిన వ్యక్తి కనబడటంతో లిఫ్ట్ అడిగి ఆస్పత్రి చేరినట్లు వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Congress  Yagagiri  Bowenpally  unknown assailants  Alwal  Land Disputes  Secunderabad  

Other Articles