Ranveer Singh goes unrecognised while clicking pics of this Asian couple

Ranveer singh goes unrecognised while clicking pics of this asian couple

ranveer singh, celebrity, bollywood hero, bajirao mastani, swiss holiday, korean couple, photographer, Ranveer Singh goes unrecognised, baji rao mastani,

Ranveer Singh goes unrecognised in Europe's snow capped alps. The actor took a picture of an Asian couple, who happily posed without knowing the celebrity status of Ranveer.

ఈ జంట ఫోటో తీసిన హీరో ఎవరో తెలుసా..?

Posted: 08/14/2016 05:14 PM IST
Ranveer singh goes unrecognised while clicking pics of this asian couple

స్విట్జర్లాండ్‌.. ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన తెల్లని మేఘాల్లాంటి మంచుకొండలతో ప్రకృతి సౌందర్యంతో అలారాడే పర్యాటకుల స్వర్గధామం. అలాంటి ప్రదేశానికి వెళితే.. ఎవరికైనా ఫొటో దిగాలనిపిస్తుంది. ఆ ప్రకృతి సౌందర్యం చెంత ఫొటో తీసుకోవాలని ఓ కొరియన్‌ జంటకు కూడా అనిపించింది. అదే సమయంలో అక్కడ తచ్చాడుతున్న ఓ యువకుడిని పిలిచి 'ప్లీజ్‌ సర్. మా ఫొటో తీసిపెట్టండి' అని రిక్వెష్ట్ చేశారు. అతను కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. అందమైన ప్రకృతిముందు ఆనందంగా ఒదిగిపోయిన ఈ జంటను క్లిక్‌మనిపించాడు. కానీ, ఆ ఫొటో వారి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.

ఎందుకంటే ఆ ఫొటో తీసింది బాలీవుడ్‌ 'బాజీరావు' రణ్‌వీర్‌ సింగ్. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్న ఈ యువ హీరో గురించి మనకు తెలుసు కానీ, కొరియన్‌ కపుల్‌కి ఏం తెలుసు? అందుకే ఓ మామూలు పర్యాటకుడు అనుకొని ఫొటో తీయించుకున్నారు. కానీ, తర్వాత తమ ఫొటో తీసింది బాలీవుడ్‌ స్టార్‌ హీరో అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. 'అతను భారత్‌లో పెద్ద హీరో అని తెలియదు. కానీ అడుగగానే ఈ ఫొటో తీసి పెట్టాడు. ఆయన పెద్ద మనస్సుకు కృతజ్ఞతలు. ఆయన పెద్ద సూపర్‌ స్టార్‌ అని తెలిసి ఆశ్చర్యపోయాం' అని కొరియన్‌ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రణ్‌వీర్‌సింగ్‌ తీసిన ఫొటోను కూడా షేర్‌ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ranveer singh  swiss holiday  korean couple  photographer  

Other Articles