నయీం బాధితుల్లో పవన్ నిర్మాత, వైఎస్ ఫ్యామిలీతో లింకులు | Pawan Kalyan producer in Naeem list

Pawan kalyan producer in naeem list

Naeem YSR, Naeem Jagan, Naeem links with Congress, Gangster Naeem Pawan Kalyan, Pawan Kalyan Producer Naeem, Naeem Tollywood relation

Pawan Kalyan producer in Naeem list and YSR family links with Naeem,

నయీం జాబితాలో పవన్ నిర్మాత?

Posted: 08/18/2016 11:39 AM IST
Pawan kalyan producer in naeem list

నయీం కు సంత్సంబంధాలు ఉన్న బడా బాబుల్లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. అగ్ర నిర్మాతలు, దర్శకులతో కూడా నయీం రిలేషన్ మెయింటెన్ చేసినట్లు క్రైం డైరీలో వెలుగు చూసింది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఓ సినిమా తీయాలని నయీం భావించినట్టు, అందుకోసం పలువురు దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

ఇటీవలే నానక్ రామ్ గూడలో ఒక బిజినెస్ మ్యాన్ తో పలు డీల్స్ లో భాగం పంచుకున్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అలాగే కింది స్థాయి నుంచి వచ్చిన పలువురు నిర్మాతలను నయీం బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తో సినిమా నిర్మించిన ఓ నిర్మాతను కూడా నయీం వదల్లేదని తెలుస్తోంది. నయీం బెదిరింపులకు భయపడి సదరు నిర్మాత 8.5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించింది. ఈ విషయాలపై పేరు చెప్పకుండా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఆ ఇద్దరితోనే సత్ససంబంధాలు
నయీం అప్పట్లో ఓ పార్టీతో సత్సంబంధాలు నడిపినట్లు వస్తున్న వార్తలు కూడా రోజుకో ఉదంతంతో బలపడుతున్నాయి. అధికారం ఉండటంతో ఆ పార్టీని చూసుకుని నయీం చెలరేగిపోయి దందాలకు ఎగబడ్డాడని, అందుకు పార్టీ పెద్దాయనతోపాటు ఆయన తనయుడు కూడా సహకరించాడని తెలుస్తోంది. అంతేకాదు నయీంకి సంబంధించిన 20 ఇళ్లకు ఇళ్లకు పెట్టుకున్న పేర్లను పరిశీలిస్తే ఆ అనుమానం బలపడక మానదు. దృశ్యం, గజిని, బిల్లా, లాంటి సినిమా పేర్లతోపాటు యాదగిరి, సిమ్లా, ఊటీ, లంక, సదరు పార్టీకి చెందిన తండ్రి కొడుకులపై అభిమానంతో వారి పేర్లను నయీం తన ఇళ్లకు పెట్టుకున్నాడు.

 

సెటిల్‌మెంట్ల కోసం ఆ 20 ఇళ్లను నయీం వాడుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇళ్ల కోడ్స్‌ సన్నిహితులకు మాత్రమే తెలిసేలా నయీమ్‌ జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నయీంకు నిజంగానే ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. పుప్పాల గూడలోని నయీం ఇంటి పేరును చూస్తే మాత్రం అతడు నిజంగానే ఆ నేతకు అభిమాని ఉంటాడన్న అనుమానం రాక మానదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster Naeem  links  Tollywood  Pawan Kalyan  Producer  

Other Articles