రియో ఒలంపిక్స్ లో భారత్ ఎలాగైనా స్వర్ణం తన ఖాతా వేసుకోవాలని ప్రార్థనలు మిన్నంటుతున్నాయి. భారత్ ప్రజానికాన్ని గౌరవంతో తలెత్తుకునేలా చేయడానికి మరో అడుగు దూరంలో నిలిచిన పివీ సింధు నామస్మరణ దేశవ్యాప్తంగా మార్మ్రోగుతోంది. పివీ సింధు ఏ రాష్ట్రానికి చెందినది, అన్న విషయాన్ని పక్కన బెట్టి మరీ ఉత్తర భారతవనీలో అమె పేరున హోమాన్ని నిర్వహించారు భారతీయ క్రీడాభిమానులు. సింధూ కన్న ఎందరో ప్రముఖ దిగ్గజాలు రియో ఒలంపిక్స్ కు ప్రాతినిథ్యం వహించిన ఒక్క సాక్షి మినహా ఇప్పటి వరకు ఎవరు భారత ఖాతలను తెరవలేదు. అయితే అమె కూడా కాంస్యంతో పరిపెట్టుకుంది.
ఈ నేపథ్యంలో భారత్ ఖాతాలో కాంస్యం కన్నా ఒక్క మెట్టు అధికమైన పతకం రజతాన్ని ఇప్పటికే ఖారురు చేసుకున్న సింధు.. స్వర్ణం పతకం కోసం ఇవాళ రాత్రి జరగనున్న పోటీలో తలపడనుంది. ఈ నేపథ్యంలో అమె విజయం సాధించాలని, అమెకు విజయలక్ష్మీ వెన్నంటి వుండాలని కోరుతూ అభిమానులు ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఫైనల్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి కోరోలినా మరిన్‌తో సిందు తలపడనున్న తరుణంలో అమె వెన్నంటే మేమున్నామని యావత్ భారతం ముక్త కంఠంతో నినదిస్తుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో విజయం సాదించిన పీవీ సింధు దేశాన్ని మొత్తం రియో వైపు తిప్పేసింది. ఏ పత్రిక, ఏ న్యూస్ ఛానెల్ చూసినా సింధు విజయంపైనే వార్తలు, చర్చలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద సింధు మేనియా సాగుతోంది.
విశాఖ వాసులు ‘గో గోల్డ్’ పేరిట నినాదాలు రాసి ఉన్న బ్యానర్లు పట్టుకుని సాగర తీరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫైనల్స్ లో భర్త్ కన్ఫామ్ చేసుకోగానే అదే నినాదం దేశవ్యాప్తంగా విస్తరించింది. గతంలో జరిగిన ఓ మ్యాచ్ లో మారిన్ ను చిత్తు చిత్తుగా ఓడించిన సింధునే రియో టైటిల్ పోరులో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మళ్లీ అదే తరహాలో కరోలినాను సింధు ఓడించాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఫైనల్స్ లో తన కూతురు విజయం సాధించి భారత్ కు పసిడి పంట పండించాలని సింధు తండ్రి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలమ్మ ఆలయంలో ఈ మేరకు ఆమె తండ్రి వెంకటరమణ ప్రత్యేక పూజలు చేశారు.
సింధుపై భారతావని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఢిల్లీ, వారణాసిలో సింధు గెలవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీవర్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సింధు విజయాన్ని కాంక్షిస్తూ తిరుపతిలో ఆమె అభిమానులు ర్యాలీలు తీశారు. బ్యానర్లు చేతపట్టి సుమారు వంద కొబ్బరికాయలు కొట్టి సింధు ఫోటోకి హారతిచ్చారు. అనంతరం ఆ ఫోటోకి దిష్టితీశారు. సింధు తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌కి సింధు పసిడి పతకంతోనే తిరిగి వస్తుందని అన్నారు. హైదరాబాద్‌లోనూ అనేక ఆలయాల్లో క్రీడాభిమానులు పూజలు నిర్వహించి, సింధు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more