Hilarious Virender Sehwag strikes again! Congratulates PV Sindhu on her stupendous victory

Not just virender sehwag amitabh bachchan is also trolling shobha de now

Olympics 2016, India, Badminton, Rio 2016 Badminton, PV Sindhu, sindhu enters final, Badminton Finals, Badminton, Carolina Marin, Amitabh Bachchan, PV Sindhu, Rio Olyampic 2016, SAKSHI MALIK, Shobha De, Virender Sehwag, virat kohli, sachin tendulkar, abhinav bindra, kavitha, latest Olympics 2016 news, olympics news

Megastar Amitabh Bachchan indirectly took a dig at author Shobha De while congratulating P V Sindhu on winning the women’s badminton singles semi-finals at Olympics in Rio

సింధూకు మేమున్నాం అండగా.. అ పెన్నెందుకు దండగ..

Posted: 08/19/2016 03:14 PM IST
Not just virender sehwag amitabh bachchan is also trolling shobha de now

రియో ఒలంపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్ లోకి దూసుకెళ్లిన పివీ సింధూకు అండగా యావత్ భారతం నిలుస్తుంది. అమె స్వర్ణంతోనే తిరిగిరావాలని అకాంకిష్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా సింధూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, ఎవరి మాటలను లక్ష్య పెట్టాల్సిన పనిలేదు.. మీకు అండగా మేమున్నామంటూ నెట్ జనులు కూడా అమెకు మనోధైర్యాన్ని అందిస్తున్నారు. కరోలినా మార్లిన్ తో జరిగే తుది పోరులో సింధు పైచేయి సాధించాలని మరోవైపు దేశానికి చెందిన క్రీడాదిగ్గజాలతో పాటు ప్రముఖులు కూడా అకాంక్షిస్తున్నారు.

మాస్టార్ బ్లాస్లర్ సచిన్

టైటిల్ వేటలో సింధు విజయం సాధించాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. క్వార్టర్ ఫైనల్, సెమీస్ లలో సింధు విజయం తనకు సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. సింధు ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా సచిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రియోలోనే ఉన్న సచిన్ ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేశారు.

విరాట్ కోహ్లీ

సింధూపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌లో ఉన్న కోహ్లీ.. ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పీవీ సింధుకి హాయ్' అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన కోహ్లీ.. రియో ఒలింపిక్స్ లో ఇండియాకు ఓ పతకం ఖాయం చేసినందుకు తాను అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాడు. సింధుని చూసి యావ‌త్ భార‌త్‌ గర్విస్తోందని అన్నాడు. ఈరోజు సింధుకి ఫైనల్‌ రూపంలో అతిపెద్ద పోరు ఎదురుకాబోతుంద‌ని ఆయ‌న చెప్పాడు. ఫైన‌ల్‌లో సింధు గెలిచి గెలిచి దేశానికి స్వ‌ర్ణం అందిస్తుంద‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. ఈరోజు జ‌రిగే చివ‌రి ఫైట్‌లో ఆ ఫలితం ఎలా ఉన్నా సింధునే మ‌న‌ ఛాంపియన్ అని అన్నాడు.

శోభా డే

ప్రముక రచయిత్రి, కాలమిస్టు శోభాడే పీవీ సింధును లక్ష్యం చేసుకోవడాన్ని అమితాబ్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన వ్యాఖ్యల ఛర్నాకోలుతో ఆమెకు సమాధానం చెప్పారు. రియో ఒలింపిక్స్ మహిళా బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్స్ లో పీవీ సింధు విజయం సాధించిన వెంటనే శోభాడే ట్విట్టర్ ద్వారా స్పందించారు. సింధును రజత పతక రాణిగా అభివర్ణించారు. దీంతో ట్విట్టర్ లో ఆమె ఫాలోయర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

వీరేంద్ర సెహ్వాగ్
 
రియో ఒలంపిక్స్ లో భారత ఆశాకిరణం పివీ సింధూ అంటూ టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ కొనయాడారు. సింధూను సిల్వర్ రాణిగా అభివర్ణిస్తూ కాలమిస్టు శోభా డే చేసిన ట్విట్లపై.. తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు సెహ్వాగ్. శోభా డే పదాలతో ఆడుకున్నాడు. సాక్షి మాలిక్ మెడలో కాంస్య పతకం 'శోభ'నిస్తే...సింధు స్వర్ణ పతకాన్ని 'దే' ('దే' అనే పదానికి 'డే' అనే పదానికి రాతలో ఒకేటే పదాలు) అంటోందని ట్వీట్ చేశాడు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్

దేశానికే వన్నె తెచ్చే మీకు అండగా మేమున్నాం.. ఆ పెన్నెందుకు దండగా అంటూ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్ చేశారు. 'మీరు ఖాలీ చేతులతో రావడం లేదు...పతకాలతో వస్తున్నారు. మీరు మెడల్ తీసుకుని వస్తుంటే మేము మీతో సెల్ఫీలు తీసుకుంటున్నాము. మీరు అతిగా మీ ప్రత్యర్థులనే కాదు, అతిగా వాగే వాళ్లను కూడా ఓడించారు. మీ చేతలతో పెన్నులను కూడా ఓడించారని ఆయన ప్రశంసించారు. సింధు మహిళా శక్తిని చాటావు...నిన్ను చూసి భారత దేశం గర్విస్తోంది' అని అభినందించారు.

అభినవ్ బింద్రా (షూటర్)

భారత షూటర్ అభినవ్ బింద్రా కూడా సింధు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో బింద్రా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో ఏ క్రీడాకారుడు కూడా ఒలింపిక్స్ లో స్వర్ణం చేజిక్కించుకోలేదు. ‘రియో’లో ఫైనల్ కు చేరిన పీవీ సింధు స్వర్ణం సాధించి తన సరసన చేరాలని, అందుకోసం తాను వెయిట్ చేస్తున్నానంటూ ఆ ట్వీట్ లో బింద్రా పేర్కొన్నాడు.

టీఆర్ఎస్ ఎంపీ కవిత

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధుపై టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశంసలు కురిపించారు. సింధు ప్రతిభను మెచ్చుకుంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. సింధు లక్షలాది మంది అమ్మాయిలకు స్ఫూర్తి అని కవిత వ్యాఖ్యానించారు. సింధు గెలుపు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు. టైటిల్ పోరులోనూ సింధు విజయం సాధిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pv sindhu  Carolina Marin  rio olympics  finals  badminton  

Other Articles