ఓవైపు అమ్మ విధుల్లో మునిగిపోయింది. మరోవైపు జ్వరంతో బాధపడుతూ పక్కనే పిల్లాడు నేలపై పడుకున్నాడు. గుండెను చిక్కబట్టుకొని ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నా.. ఆమె మనసంతా అస్వస్థతతో ఉన్న తన చిన్నారిపైనే. అందుకే కొడుకును ఇలా ఆఫీసుకు తెచ్చుకొని తన కళ్లముందే పడుకోబెట్టింది. ఓవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు తన చిన్నారిని చూస్తూ.. ఉద్యోగం చేసే మాతృమూర్తుల ఆవేదనను కళ్లకు కట్టిన ఆ అమ్మ ఫొటో ఇప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. వైరల్‌గా మారిపోయింది.
'నేలపై పడుకున్నది పిల్లాడు కాదు, నా హృదయం' అంటూ పుణెకు చెందిన బ్యాంకు ఉద్యోగిని స్వాతి చితాల్కర్ ఫేస్బుక్లో ఈ ఫొటో పెట్టారు. 'తనకు తీవ్రంగా జ్వరంగా ఉంది. నాతో తప్ప ఇతరులతో ఉండలేని స్థితిలో ఉన్నాడు. ఆఫీసులో హాఫ్ డే అయిపోయింది. అంతేకాకుండా అర్జెంట్‌గా రుణాలు విడుదల చేయాల్సిన పని ఉంది. దీంతో మధ్యలో సెలవు తీసుకోలేని పరిస్థితి. అందుకే ఇలా పిల్లాడిని పక్కన ఉంచుకొని విధులు నిర్వహిస్తున్నాను' అని స్వాతి తన పోస్టులో వివరించింది. అసెంబ్లీలో సోయితప్పి నిద్రపోయే మంత్రులకు చిన్న సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఈ ఫొటో పెట్టినట్టు ఆమె తెలిపింది.
మాతృమూర్తి ప్రేమ చాటుతూ ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు అందరి హృదయాలనూ కదిలిస్తున్నది. ఈ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పోస్టును 19,500మందికిపైగా షేర్ చేసుకున్నారు. దేశంలో ఉద్యోగం చేసే మహిళలు, మాతృమూర్తులు నిత్యం ఎదుర్కొనే అవస్థను ఈ ఫొటో కళ్లకు కట్టిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more