భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల రూపాయల కోద్ది డబ్బును కంటైనర్ల ద్వారా రవాణా చేయిస్తూ.. తమ నిర్లక్ష్య ధోరణినిన చాటుకుంటున్నారు. ఇప్పటికే దేశ అర్థిక రాజధాని ముంబైలో కోట్ల రూపాయల చోరీలు నమోదవుతున్నా.. దోంగలను మాత్రం ఇంకా పట్టుకోనేలేదు. ఇలాంటి తరుణంలో డబ్బును పకడ్భందీగా పంపించాల్సిన అవసరం ఏర్పడిందని గ్రహించాల్సిన అధికారులు.. తమకు కారుచౌకగా లభించే రవాణాను ఎంచుకోవడం సముచితం కాదన్న సూచనలు వినబడుతున్నాయి.
మెన్నటికి మెన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.570 కోట్ల నగదును ఎన్నికల కమీషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే కాగా, తాపీగా నిద్రలేచిన బ్యాంకు అధికారులు మాత్రం ఎన్నికల అధికారులు పట్టుకున్న డబ్బు తమదేనంటూ.. దాన్ని తమ బ్యాంకు నుంచి మరో శాఖకు పంపుతున్నామని వివరణ ఇచ్చారు. అయితే అ డబ్బుకు ఎస్కార్టుగా కేవలం ఒక కారులో నలుగురు పోలీసులు మాత్రమే వున్నారు. అయితే అప్పటి వరకు విషయం బయటకు తెలియకపోవడంతో పెద్ద ఇబ్బంది లేకుండాపోయింది. ఈ ఘటన మరవకముందే తాజాగా మరొక సంఘటన జరిగింది. రూ.500 కోట్ల నగదు తీసుకెళ్తున్న రెండు కంటైనర్లలో తరలిస్తున్నారు అధికారులు.
సరిగ్గా మదురై జిల్లా తిరుమంగళం వద్ద టీ తాగేందుకు డ్రైవర్లు ఆపారు. అనంతరం లారీల్ని స్టార్ట్ చేయగా ఒకటి మొరాయించింది. కంటైనర్లలో డబ్బు విషయం చుట్టుపక్కల వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. లారీలకు ఎస్కార్టుగా ఉన్న సీఐఎస్ఎఫ్ సబ్ఇన్స్పెక్టర్ మణికంఠన్, పదిమంది కమాండో పోలీసులు జనాన్ని అదుపు చేసేందుకు తంటాలు పడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక డీఎస్పీ సిబ్బందితో అక్కడికి చేరుకుని భద్రత కల్పించారు. ఈ డబ్బును ఆర్బీఐ మైసూరు నుంచి తిరువనంతపురానికి పంపిస్తోంది. ఇదే ఘటన మరోసారి పునారావృతం అయితే ఏం జరుగుతుందోనన్న అందోళన పోలీసులలో కనిపించింది. కోట్ల రూపాయల డబ్బుకు ప్రమాధం సంభవించిన తరువాత లబోదిబోమంటూ మోత్తుకోకుండా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని సూచనలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more