కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ భారి నుంచి తమను రక్షించాలని అర్థిస్తూ తన వద్దకు వచ్చిన ఓ బాధితుడిని ఆ ప్రజాప్రతినిధి తిరస్కరించారు. పైగా అతని వద్దకే వెళ్లి సెటిల్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో సదరు నేత పేరు ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేశారు పోలీసులు. ప్రజాప్రతినిధుల్లో కొందరు నయీమ్‌కు సహకరించారని ఇప్పటివరకు ఆరోపణలు పరోక్షంగా రాగా, తొలిసారి ఓ ప్రజాప్రతినిధి పేరును ఈ కేసులో పోలీసులే ప్రస్తావించడం రాజకీయ సంచలనానికి దారితీసింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పేరును నయీమ్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో పోలీసులు ప్రస్తావించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి టౌన్ పోలీసులు నమోదు చేశారు. భువనగిరిలో రైస్ మిల్, పెట్రోల్ బంకు వ్యాపారాలున్న తన వద్దకు నయీమ్ అనుచరలమని చెప్పుకునే పాశం శ్రీనివాస్, మరో వ్యక్తి నాగేందర్ వచ్చి నయీమ్ ను కలవాలని తమ ఆఫీసు మేనేజర్ కృష్ణకు సమాచారమిచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మార్చి 17న ఈ మేరకు మళ్లి వారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 18న నయీమ్ భాయ్‌ని కలవాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటా’యని బెదిరించాడు.
నయీమ్ నుంచి కాపాడాలని ప్రజాప్రతినిధి నేతి విద్యాసాగర్ ను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో నాగేందర్ కలువగా, నయీమ్ తోనే నేరుగా కలసి మాట్లాడుకోవాలని ఆయన సూచించాడని పిర్యాదులో పేర్కోన్నాడు. 18న పాశం, మరో ఇద్దరు కలిసి నాగేందర్‌ను భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి డస్టర్ కారులో కళ్లకు గుడ్డలు కట్టి ఘట్కేసర్, ఔటర్రింగురోడ్డు దాటించి తీసుకెళ్లారు. తర్వాత నలుపు ఎక్స్‌యూవీ 500 కారులోకి మార్చి చివరికి నయీమ్ వద్దకు తీసుకెళ్లారు. నయీమ్ ముగ్గురు 20 ఏళ్ల సాయుధ యువతులతో కలిసి ఉన్నాడు. తనకు రూ.5 కోట్లు తనకు ఇవ్వాలన్నాడు. లేదంటే నాగేందర్‌ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడు. చివరికి రూ.కోటి ఇచ్చేందుకు నాగేందర్ అంగీకరించాడు. ఏప్రిల్ 30లోపు డబ్బులివ్వాలని, లేదంటే నాగేందర్ కొడుకుల్లో ఒకరిని చంపేస్తానని, తర్వాత మిగతా వాళ్లనూ అంతం చేస్తానని నయీమ్ హెచ్చరించాడు.
‘‘మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని చంపినట్టుగానే నీ కొడుకునూ హత్య చేస్తా. రోడ్డు ప్రమాదంగా చిత్రిస్తా, ఎవరూ పసిగట్టలేరు కూడా’’ అని నాగేందర్‌ను బెదిరించాడు. తర్వాత నాగేందర్‌ను గంతలు కట్టి తీసుకెళ్లి భువనగిరి రేణుకా ఎల్లమ్మ గుడి దగ్గర దింపేశారు. తర్వాత ఏప్రిల్ 30న నాగేందర్ పక్కింటి వ్యక్తికి ఎమ్మెల్సీ విద్యాసాగర్ ఫోన్ చేశారు. నాగేందర్ ఫోన్ స్విచాఫ్ వస్తోందని అతనికి చెప్పాడు. వెంటనే నాగేందర్‌తో తనకు ఫోన్ చేయించాలన్నాడు. దాంతో నాగేందర్ తన మొబైల్ నుంచి విద్యాసాగర్‌కు ఫోన్ చేశాడు. ‘నయీమ్ ఫోన్ చేస్తాడు, ఫోన్ ఆన్‌లోనే ఉంచుకో’ అని నాగేందర్‌కు విద్యాసాగర్ చెప్పాడు. ఉదయం 8:30 ప్రాంతంలో నాగేందర్‌కు నయీమ్ ఫోన్ చేశాడు. వెంటనే డబ్బు చెల్లించాలని బెదిరించాడు. దీంతో తప్పనిపరిస్థితుల్లో వారికి డబ్బు చెల్లించానని నాగేందర్ తన పిర్యాదులో పేర్కోన్నాడు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more