మోనో సోడియం గ్లుటామేట్ వుందని, ధీని ప్రభావంతో అరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారిన పడతారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం విధించడంతో ఆ తరువాత కూడా పలు మ్యాగీ శాంపిల్స్ లో ఎంఎస్జీ ఉందని తేలడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కోన్న మ్యాగీ.. మళ్లీ భారతీయ విఫనిలో నెంబర్ వన్ గా నిలిచింది. నిషేధంతో మ్యాగీ పని అయిపోయిందని, ఇక దాని బదులుగా గోదుమ నుడ్యూల్స్ వచ్చినా.. మార్కెట్ ను ఈ లోపు కబ్జా చేయాలని ఎన్నో కంపెనీలు పోటీపడినా.. వాటి అంచనాలను మ్యాగీ తలకిందులు చేసింది.
ఈ ఏడాది ప్రథమార్థం వరకు 57 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని మార్కెట్లో తన ఆధిపత్య స్థానాన్ని మ్యాగీ పునరుద్ధరించుకుంది. రీఎంట్రీ ఇచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే 57.1 శాతం మార్కెట్ షేరును మ్యాగీ కైవసం చేసుకోవడంపై నెస్లే ఇండియా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇన్ స్టెంట్ నూడుల్స్ సెగ్మెంట్లో ఆరోగ్యవంతమైందిగా మ్యాగీ నిలుస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో పలు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. ఇవి క్యాన్సర్ ముప్పుకు దారితీస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి
ఐదు నెలల నిషేధం కాలంలో నెస్లే ఇండియా రూ.500 కోట్లకు పైగా విక్రయాలను కోల్పోవాల్సి వచ్చింది. ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ నాణ్యమైనవేనని తేలడంతో మళ్లీ ఉత్పత్తులను నవంబర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నిషేధం అనంతరం మొదటిసారి గత డిసెంబర్లో మ్యాగీకి డిమాండ్ పుంజుకుంది. మార్కెట్లోకి పునఃప్రవేశించిన ఒక నెలలోనే 35.2 శాతం మార్కెట్ షేరు పెంచుకుంది. 2016 మార్చిలోనే ఈ ఇన్ స్టెంట్ నూడుల్స్ 51 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more