సిరియాలో అంతర్యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. రెండు అగ్రరాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటం అక్కడ రావణ కాష్టాన్ని రగిలిస్తోంది. ఇస్లామిక్స్టేట్పై యుద్ధంపేరిట అత్యాధునికమైన యుద్ధవిమానాలతోనూ, యుద్ధనౌకలతోనూ విరుచుకుపడుతున్నాయి. గత వారం ప్రపంచాన్ని కదిలించిన నాలుగేళ్ల పిల్లాడు ఒమ్రాన్ ఫోటో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. బాంబు దాడి అనంతరం రక్తపు మడుగులో దుమ్ము దూళి అంటుకున్న ఒమ్రాన్ కదలకుండా కూర్చీలో బొమ్మలా కూర్చోవటం కంటతడి పెట్టించింది. ఆ దాడిలో ఒమ్రాన్ సోదరుడు మృత్యు వాత పడగా, తల్లిదండ్రులు ఇంతవరకు ఏమయ్యారో తెలీదు. ఫోటో ఇక ఇప్పుడు సరిగ్గా అలాంటి మరో వీడియో బయటికి వచ్చింది.
నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న ఓ చిన్నారి పాట పాడుతుండగానే ఆమె ఇంటిపై బాంబు దాడి జరగటం వీడియో బయటికి వచ్చేసింది. 45 సెకన్ల ఆ వీడియోలో తన తల్లితో ఎంకరేజ్ చేస్తుంటే ఆ పాప సంతోషంగా పాట పాడుతూ కనిపించింది. చివర్లో ఇంటిపై ఏదో పడగా, వీడియో హఠాత్తుగా కట్ అయిపోయింది. అక్కడంతా గందరగోళం నెలకొంది. అక్కడ పెద్ద ఎత్తున్న వైమానిక దాడులు జరిగినట్లు, అందులో ఆ చిన్నారి కుటుంబం ప్రాణాలతో ఉందో లేదో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడుల అనంతరం ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న స్థానిక మీడియా దీనిని నెట్ లో ఉంచినట్లు తెలుస్తోంది.
సిరియా చుట్టూ తిష్ట వేసుకున్న అమెరికా, రష్యా దళాలు శాంతి భద్రతల పేరుతో సిరియాపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఐదున్నరేళ్ళ కాలంలో నాలుగులక్షమందిని పొట్టనబెట్టుకొని, లక్షలాదిమందిని నిరాశ్ర యులను చేసిందీ దమనకాండ. రెండవ ప్రపంచయుద్ధం తరువాత అతిపెద్ద శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించిన ఈ యుద్ధం రాను రాను మరింత విస్తరిస్తుందే తప్ప ముగింపునకు మాత్రం చేరుకోవటం లేదు. ఇంకోవైపు తిరుగుబాటుదారులు సామూహిక హత్యాకాండలతో ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరుగు పొరుగు దేశాల తిరుగుబాటు గ్రూపులు వీలైనంత విధ్వంసం సృష్టిస్తూ దోచుకుపోతున్నాయి. ఆరేళ్ళక్రితం వరకూ హాయిగా ఉన్న సిరియా ఇప్పుడు స్మశా నంగా మారిపోవడం వెనుక ఎవరిపాత్ర ఎంతున్నదో తెలియనిది కాదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more