బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం ఇటలీని అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో కూడిన భూకంపం ధాటికి నిన్న ఇటలీలోని పలు పట్టణాలు నేలమట్టమయ్యాయి. ప్రధానంగా అమట్రీస్ నగరం ఈ భూకంపం ధాటికి పూర్తిగా దెబ్బతింది. నగరంలోని భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 160కి చేరింది. ఇంకా జాడ తెలియని వారి సంఖ్య వందల్లోనే ఉందట.
ఇరుకుగా ఉన్న భారీ భవనాలు కుప్పకూలిపోవటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆ దేశ ప్రధాని మట్టియో రెంజీ... పెను భూకంపం ఏ ఒక్కరిని వదలలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు ఆయన ప్రకటించారు.
నిజానికి ఈ తీవ్రతకు ఇంతలా ప్రాణ నష్టం సంభవించిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. షాలో ఎర్త్‌క్వేక్స్ ప్రభావంతోనే ఇలా జరిగిందటున్నారు బ్రిటన్‌లోని డర్హమ్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ లెక్చరర్ డాక్టర్ రిచర్డ్ వాల్టర్స్ . దీని ప్రకారం భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉంటుంది. మామూలుగా భూకంపాలు వచ్చినప్పుడు దాని తీవ్రత భూమికి 30 నుంచి 700 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. దానివల్ల ప్రకంపనలు భూమి ఉపరితలం వరకు వచ్చి.. వాటి ప్రభావం పైన ఉన్న కట్టడాల మీద పడటానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆలోపే దాని తీవ్రత కూడా చాలావరకు తగ్గుతుంది. కానీ, ఇటలీలో ఇప్పుడు వచ్చిన భూకంపం దాని కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండటం వల్లే దాని ప్రభావం ఎక్కువగా ఉండి నష్టం కూడా భారీగా సంభవించింది.
మయన్మార్ లో నలుగురు...
మరోవైపు పొరుగున ఉన్న మయన్మార్ లో 6.8 తీవ్రతతో కుదిపేసిన భూకంపం నలుగురిన బలితీసుకుంది. కానీ, అక్కడి ఆలయాల పైనే దీని ప్రభావం ఎక్కువగా చూపింది. పురాతన కట్టాడాలు కావటంతో 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. ఓ పురుషుడు, మహిళతోపాటు ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. భూకంప కేంద్రం మయన్మార్‌కు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గరలో, 90 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన రెండు రోజుల్లో మయన్మార్ లో రెండు సార్లు భూమికంపించగా, ఈ యేడాది ఇదే ప్రాంతంలో భూకంపం రావటం ఇది 26వ సారి. తాజా భూకంపం భారత్ ఈశాన్య, తూర్పు ప్రాంతలపై స్వల్ఫ ప్రభావాన్ని చూపగా, ప్రాణ నష్టం ఏం సంభవించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more