బీసీసీఐ పై లోథా కమిటీ లైంగిక ఆరోపణలు | Lodha Panel secretary accuses selectors of seeking sexual favours

Lodha panel secretary accuses selectors of seeking sexual favours

Lodha Panel secretary Shankar Narayanan, Shankar Narayanan mail to Anurag Thakur, Anurag Thakur on sexual allegations, Lodha Panel secretary accuses, AJay Shirkey on sexual allegations

Lodha Panel secretary accuses selectors of seeking sexual favours, but board thrashes them.

సెలక్ట్ చేయాలా? అయితే సెక్స్ కోరిక తీర్చాల్సిందే

Posted: 08/25/2016 10:58 AM IST
Lodha panel secretary accuses selectors of seeking sexual favours

రాజకీయ జోక్యంతో పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ)ని ప్రక్షాళన చేయాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ మరియు అవినీతి ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే బోర్డు కదలికలను పరిశీలించడం మొదలుపెట్టిన లోథా కమిటీ బీసీసీఐ సెలెక్టర్లపై సంచలన ఆరోపణలకు దిగింది. యువ ఆటగాళ్ల ఎంపిక కోసం లైంగిక వాంఛలు తీర్చాల్సిందిగా వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు ఆగస్టు 9న లోథా ప్యానెల్‌తో జరిగిన సమావేశంలో కమిటీ కార్యదర్శి శంకర్‌ నారాయణన్‌ సెలెక్టర్లపై ఈ నిందారోపణలు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అజయ్‌ షిర్కే చెబుతున్నారు. ఔత్సాహిక యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు లైంగిక వాంఛలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ఆటగాళ్ల తల్లులను తమ దగ్గరికి పంపాలని సెలెక్టర్లు కోరుతున్నారు. దిగజారి వారు ఇలాంటి తప్పులు చేస్తున్నా బోర్డు పట్టించుకోవటం లేదు. అనైతిక, అక్రమాలకు పాల్పడుతున్నా.. బీసీసీఐ మౌన ప్రేక్షకుడిలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇది ఒక్క బీసీసీఐలోనే లేదు, రాష్ట్ర స్థాయి బోర్డుల్లో కూడా జరుగుతోంది అని శంకర్ నారాయణన్ సమావేశంలో పేర్కొన్నట్లు షిర్కే చెప్పారు.

నిజానికి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, మిగతా సెలక్టర్లు ప్యానెల్ ముందు హాజరు కావాల్సింది. అయితే అదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఆయన గైర్హాజరయ్యారు. అనురాగ్ బదులుగా సెక్రటరీ అజయ్ షిర్కే ఒక్కరే హాజరు కాగా, ఆయనతో పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నింటిని సమావేశంలో లేవనెత్తటమే కాదు, 14 పాయింట్ల నివేదికను బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ కి కూడా ఈమెయిల్‌ ద్వారా శంకర్ నారాయణణ్ తెలియజేశారని షిర్కే వివరించారు.

అయితే ఈ ఆరోపణలను తాను ఖండించానని షిర్కే తెలిపారు. బీసీసీఐ చరిత్రలో ఇలాంటివి జరిగినట్టు ఎప్పుడూ తమ దృష్టికి రాలేదు. ఈ విషయాలను నారాయణన్‌తో కూడా చర్చించాను. సెలెక్టర్లందరూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థరహితం, నిరాధారం అని షిర్కే తెలిపారు. అదే సమయంలో ఈ విషయమై స్పందించేందుకు శంకర నారాయణన్‌ నిరాకరించడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Lodha Panel  Shankar Narayanan  Ajay Shirkey  

Other Articles