ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారని, యూటర్న్ తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకుని, క్షమాపణలు చెప్పాడని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలమే మహాత్మా గాంధీ హత్యకు దారితీసిందన్న రాహుల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఆయనపై పరువునష్టం కేసు వేశారని అన్నారు.
ఇంకోవైపు ఆరెస్సెస్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేశాడు. అయితే గాంధీని ఆరెస్సెస్ సంస్థ హత్య చేసిందని తాను నిందించలేదని, ఈ ఘాతుకం వెనుక ఆర్ఎస్ఎస్ వ్యక్తులున్నారని మాత్రమే వ్యాఖ్యానిం చానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరించాడు. 2014 ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హత్యలో ఆరెస్సెస్ హస్తం ఉందని ఉపన్యసించాడు. దీనిపై ఆరెస్సెస్ పరువు నష్టం కేసు వేయగా, బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి.
దీనిపై విచారించిన ధర్మాసనం స్పందిస్తూ.. నిందితుడు గాంధీని ఆరెస్సెస్ హత్య చేసినట్లు వ్యాఖ్యానించలేదని, ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు చేసినట్లు అన్నారని భావిస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ సంతృప్తి చెందితే కేసును కొట్టివేస్తామని, లేకపోతే విచారణ ముందుకు వెళ్తుందని బెంచ్ తెలిపింది. ఈ కేసులో రాహుల్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించడం విశేషం. ఇక ఆరెస్సెస్‌పై ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు హాజరవడం మంచిదేనని, ఆయన యూటర్న్ తీసుకున్నా అది మంచి టర్నే అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more