కశ్మీర్ అల్లర్ల మృతులపై ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు | People shot in Kashmir were not out to buy milk chocolate

People shot in kashmir were not out to buy milk chocolate

Kashmir CM Mehbooba Mufti, People shot in Kashmir, Kashmir Chaos Rajnath Singh, Rajnath Singh in Kashmir, Burhan Wani encounter

People shot in Kashmir were not out to buy milk chocolate CM Mehbooba Mufti said.

వాళ్లేం చాక్లెట్లు, పాల కోసం చావలేదు

Posted: 08/25/2016 04:00 PM IST
People shot in kashmir were not out to buy milk chocolate

నెలకు పైగా రగులుతున్న కశ్మీర్ గడ్డపై సెగలు చల్లార్చేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. వేర్పాటువాదులతో కూర్చుని సామరస్యంగా చర్చలు చేపట్టేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కాస్త ఎమోషన్ లా కనిపించారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

జమ్ము కశ్మీర్ లో నిరసనలకు దిగుతూ, భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన వారిపై ఆమె నోరు జారి మాట్లాడారు. వారేమీ పాలు లేదా చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి తిరిగి వెళ్లేందుకు రాలేదని, పోలీస్ స్టేషన్ పై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయటంతోనే ఆ ముగ్గురు తీవ్రవాదులను కాల్చేశారని ఆమె చెప్పుకొచ్చారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వటం, ఆందోళనలు చేయటం సమస్యలకు పరిష్కారం కాదు. నిరసనలు హింసాత్మకంగా మారినందునే పెలెట్లు, బులెట్లు వాడాల్సివచ్చింది. ఫలితంగానే వారు చనిపోయారని అని ఆమె చెప్పుకొచ్చారు.

2010లో భద్రతాదళాల చర్యల్లో పౌరులు హతమైన వేళ, తీవ్ర విమర్శలు చేసిన మీరు, ఇప్పుడు అదే తరహా ఘటనలను ఎలా సమర్థించుకుంటారని మీడియా ఓ ప్రశ్న అడిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ఆరేళ్ల క్రితం జరిగింది ఫేక్ ఎన్ కౌంటర్, ఆ కారణంగా అల్లర్లు చెలరేగాయని, ఇప్పుడు మాత్రం నిజంగానే జరిగింది. చనిపోయింది కరడుగట్టిన తీవ్రవాది బుర్హాన్ వానీ. పైగా ఈ సమయంలో నిరసనలను దగ్గరుండి ప్రోత్సహించే వర్గాలు తయారయ్యాయని అన్నారు. అప్పుడు చనిపోయిన వారికి, ఇప్పుడు అల్లర్లలో మరణించిన వారికి పోలికలు లేవు, ప్రతిపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయి అని ముఫ్తీ వెల్లడించారు.

ఇక జూలై 9 నుంచి జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటిదాకా 69 మంది మరణించగా, అల్లర్లలో 10వేల మంది గాయపడ్డట్లు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు త్వరలో బయటి రాష్ట్రానికి చెందిన ఓనోడల్ అధికారిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnath Singh  Mehbooba Mufti  Kashmir  Chaos  

Other Articles