గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మరో పేరు కూడా ఉందా..? ఛత్తీస్‌గఢ్‌లో జేమ్స్ అనే పేరుతో నయీమ్ చలామణి అయ్యాడా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నా రు సిట్ అధికారులు. ఆడవేషాలు, బుర్ఖాలు, ముసుగులతో ఎప్పుడూ సంచరించే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు భావిస్తున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బెదిరింపులు, భూ ఆక్రమణలు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన నయీమ్ ఈ నెల 8న ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు నయీమ్‌కు జేమ్స్ అనే మరో పేరు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి నయీమ్‌ను ఉపయోగించుకోవాలని అక్కడి పోలీసులు భావించారు. శత్రువులకు చిక్కకుండా ఉండటానికి అప్పుడే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు తెలిసింది.
ఇదిలావుండగా, నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిపై సిట్ నిఘా పెట్టింది. సిట్ అధికారులు భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్యవర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి.. డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
నయీమ్ అనుచరుడైన మరో డ్రైవర్ ఫయీముద్దీన్ అలియాస్ ఫయాజ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న నయీమ్ అల్లుడు ఫయీమ్ చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని రోషన్‌కాలనీలో నివాసముండే ఫయాజ్‌పై నిఘా వేసి శాతంరాయ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఒక తపంచా, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రోషన్‌కాలనీలోని ఫయాజ్ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు అతని భార్యతో పాటు మరో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ద్విచక్రవాహనంతో పాటు రెండు స్పోర్ట్స్ బ్యాగుల్లో వందలాది భూ డాక్యుమెంట్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంగ్ స్టర్ నయీమ్ మరో అనుచరుడు సగ్గర హరి అనే వ్యక్తిని పోలీసులు భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసుకు తరలించారు. నయీమ్ బాధితుడు, ఎలక్ట్రానిక్స్ అండ్ సానిటరీ షాపు యజమాని సుంచు నరహరి ఫిర్యాదు మేరకు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సగ్గర హరి కాకినాడకు చెందిన వ్యక్తి. గత కొంత కాలంగా భువనగిరిలో స్థిరపడిన ఇతను నయీం సెటిల్మెంట్‌లలో ఇతను కీలకవ్యక్తిగా భావిస్తున్నారు. వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి నయీం ద్వారా సెటిల్మెంట్‌లు జరిపినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more