కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి.. ఆమోదించిన జీఎస్ టీ బిల్లు పై ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్విట్లు చేశారు. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు అమోదించవద్దని తాను బీజేపి పాలిత సీఎంలకు లేఖలు రాస్తానని స్వపక్షంలోనే విపక్షం మాదిరిగా వ్యవహరించేలా ట్విట్ చేశారు. జీఎస్టీ బిల్లుపూ అసలు నోరు మెదపనని, దానిపై తాను మాట్లాడితే ఘర్షణలు జరుగుతాయన్న ఆయన అభిప్రాయపడ్డారు. తనదైన వివాదాస్పద శైలిలో వస్తే గూడ్స్ అండ్ సర్వీసు టాక్స్ నెట్ వర్క్(జీఎస్టీఎన్)పై ట్విట్టర్లో బాంబు పేల్చారు.
జీఎస్జీ బిల్లును ఆమోదిస్తున్న రాష్ట్రాలు జీఎస్టీఎన్ వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ సీఎంలకు లేఖలు రాస్తానని ట్వీట్ చేశారు. ఓ వైపు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ సమావేశమైన నేపథ్యంలో స్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పన్ను విధానాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి జీఎస్టీఎన్ పేరుతో ఒక స్వచ్చంద, లాభపేక లేని సంస్థలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. జీఎస్టీఎన్ నిర్మాణం జాతి వ్యతిరేకకు సంబంధించిందని స్వామి వ్యాఖ్యానించారు.
జీఎస్టీఎన్లో 24.5 శాతం స్టేక్ ప్రభుత్వం చేతిలో, మరో 24.5 శాతం రాష్ట్రాల చేతిలో ఉంటుంది. మిగిలిన 51 శాతం స్టేక్ ప్రభుత్వేతర ఆర్థిక సంస్థల స్వాధీనంలోకి వెళ్లిపోతుందని స్వామి ఆరోపిస్తున్నారు. జీఎస్టీఎన్లో మెజార్టీ స్టేక్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్ ఐసీ హౌసింగ్ లిమిటెడ్, హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఎస్ఈ స్ట్రాటజిగ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిడెట్ వంటి ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి జీఎస్జీఎన్ వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎస్టీఎన్ ను వ్యతిరేకించాలంటూ అమిత్ షాకు, బీజేపీ రాష్ట్ర సీఎంలకు లేఖ రాస్తా అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీడీపీ వృద్ధికి జీఎస్టీ సమాధానం కాదని, కార్మిక ఉత్పాదకత, అధిక పెట్టుబడులు అవసరమని ముందు నుంచి స్వామి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యనే రఘురామ్ రాజన్పై కామెంట్లుచేసి తీవ్ర వివాదాస్పదంగా మారారు. హైకమాండ్ ఆదేశాలతో ఈ మధ్యన కొంచెం సైలెన్సు అయిన స్వామి, ఈసారి డైరెక్ట్గా హైకమాండ్పైనే విమర్శలకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more