Drunk Kollywood actor Arun Vijay rams car into cops' van, booked

Actor arun vijay booked after accident in wee hours

arun vijay,arun vijay drink driving,arun vijay controversy,arun vijay drink and drive case,drunk driving case,celebrity controversy,tamil celebs controversy

Tamil actor Arun Vijay booked for driving under the influence of alcohol after reportedly rammed into a parked police vehicle outside Nugambakkam police statiojn in Chennai.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ప్రముఖ నటుడు

Posted: 08/28/2016 08:04 AM IST
Actor arun vijay booked after accident in wee hours

సినిమా నటులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్‌లో పోలీసులకు పట్టుబడటం సర్వసాధారణమైన విషయమే. అయితే ప్రముఖ నటులు మాత్రం ఇప్పటివరకు పట్టుబడలేదు. కానీ తమిళనాడులో ప్రముఖ నటుడు అరుణ్ విజయ్‌ ఈ కేసులో పట్టుబడ్డాడు. సీనియర్ నటుడు విజయకుమార్ తనయుడు అరుణ్ విజయ్ పలు చిత్రాలలో కథనాయకుడిగా నటించాడు, అయితే ఆయన మద్యం మత్తులో ఏకంగా పోలిస్ స్టేషన్ ఎదురుగా నిలిపి వున్న పోలీస్ వాహనాన్నే ఢికొనడంతో పోలీసులు అరెస్టు చేశారు.

వివర్లాల్లోకి వెళ్తే.. స్థానిక నుంగంబాక్కంలో గల ఒక నక్షత్ర హోటల్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజరైన అరుణ్‌విజయ్ అర్ధరాత్రి వరకూ అక్కడ గడిపి వేకువ జామున 3.40 గంటల ప్రాంతంలో కారులో ఇంటికి తిరిగి పయనం అయ్యారు. కాగా బాగా మద్యం తాగి ఉన్న ఆయన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్ ముందు నిలిపివున్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో పోలీస్ వాహనంతో పాటు అతను నడుపుతున్న వాహనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. కారులో వున్న అరుణ్ విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా అతనికి గాయాలయ్యాయా.? అని పరిశీలించారు. అయితే ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
 
దీంతో నుంగంబాక్కం పోలీసులు అరుణ్ విజయ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో సమాచారం అందిన అరుణ్ విజయ్ తండ్రి విజయకుమార్ వెంటనే నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం స్థానిక పాండిబజార్ ట్రాఫిక్ పోలీస్ అధికారులను కలిసి సొంత పూచీకత్తుపై బెయిల్‌తో అరుణ్ విజయ్‌ను విడిపించి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే పాండిబజార్ ట్రాఫిక్ విభాగం పోలీస్‌అధికారులు అరుణ్‌విజయ్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk and drive case  Actor Arun Vijay  arrest  kollywood  

Other Articles