not scared of any one, bound for state development says chandrababu

Chandrababu responds on pawan kalyan allegations

Andhra pradesh cm chandrababu, chandrababu responds to pawan kalyan, Pawan Jana Sena Prasthanam meeting, opposition parties, Tsp mla Roja, caste editorials, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting, pawan kalyan special status to AP

Andhra pradesh chief minister chandrababu naidu responds on allegations of Actor turned politician Jana Sena chief Pawan Kalyan, says he is not scared of any one.

మేం ఎవరికీ భయపడం.. రాష్ట్ర ప్రగతి కోసమే కేంద్రంతో దోస్తీ..

Posted: 08/28/2016 07:53 PM IST
Chandrababu responds on pawan kalyan allegations

'ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సీబీఐ కేసులంటారు.. దాచుకోడానికేమైనా ఉన్నాయా? ఏమీ లేనప్పుడు కేంద్రమంటే ఎందుకంత భయం?' అని  సీఎం చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో దుమారం చెలరేగుతోంది.  కేంద్రంతో పోరాడితే వచ్చేదేమీ లేదని, అయితే కేంద్రంతో సన్నిహితంగా మెదిగి సాధించుకోవడమే తమ కర్తవ్యంగా చెపుకోచ్చారని చెప్పారని పవన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు ఒక్కొక్కరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే అవంతి శ్రీనివాన్ తనకు పిచ్చివుందని చెప్పగా, ఎంపీ పదవి తనకు వెంట్రుకతో సమానమని జేసీ దివాకర్ రెడ్డి పేర్కోన్నారు,

ఈ క్రమంలో చివరికి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై తాను ఎవరికీ భయపడటంలేదని, తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలపై తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలోఉంచుకునే టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నదని చంద్రబాబు చెప్పారు. అనంతలో ఎండిపోతున్న వేరుశనగ పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  Pawan Kalyan  Jana Sena  special status  Andhra pradesh  Ananthapur  

Other Articles