LeJ militants who attacked Sri Lankan cricket team killed

Three alleged sri lankan team attackers shot dead

pakistan, Lej terrorists, shoot out, sri lankan cricket team, pakistani taliban group, lashkar-e-jhangvi, Attack on Srilankan team, Attack On Sri Lankan Cricket team, police custody, lahore

Four of the 10 terrorists allegedly involved in the 2009 attack on the visiting Sri Lankan cricket team in Lahore were killed in a shootout with police

శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడికి పాల్పడిన తీవ్రవాదులు హతం

Posted: 08/29/2016 08:25 AM IST
Three alleged sri lankan team attackers shot dead

పాకిస్థాన్ ఉగ్రవాదలుకు స్వర్ఘధామంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని బలపర్చేందుకు ఏడేళ్ల క్రితం జరిగిన ఘటనన ప్రపంచ దేశాలు ఉదహరిస్తున్నాయి. అయితే ఆ డాడులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను పాకస్తాన్ బలగాలు హతమార్చాయి. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ ముగ్గురితో పాటు మరో ఉగ్రవాది హతమైనట్టు కౌంటర్ టెర్రరిజం అధికారులు తెలిపారు. మృతిచెందిన ఉగ్రవాదులను జుబైర్ అలియాస్ నాయక్ మహమ్మద్, అబ్దుల్ వాహబ్, అద్నాన్ ఆర్షాద్, అటీఖర్ రెహ్మాన్గా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.

శ్రీలంక క్రికెటర్లపై దాడిచేసిన ఘటనలో జుబైర్, అబ్దుల్ వాహబ్, అద్నాన్ ఆర్షాద్కు ప్రమేయం ఉన్నట్టు కౌంటర్ టెర్రరిజం అధికారులు చెప్పారు. 2009లో పాకిస్తాన్ పర్యటనలో భాగంగా వెళ్లిన సిరీస్ అడుతున్న శ్రీలంక క్రికెటర్లు.. మార్చి 3న గఢాఫీ స్టేడియానికి వెళ్తున్న బస్సుపై అప్పట్లో ఉగ్రవాదలు కాల్పులతో తెగబడ్డారు. ఆ దాడుల నుంచి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన జట్టు తమ అనుభవాలను కూడా తెలిపింది. అయితే అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకు పాకిస్థాన్ లో ఎలాంటి క్రీకెట్ సిరీస్ లు కూడా జరగలేదు. ఈ దాడిలో ఆరుగురు పోలీసు అధికారులు, ఎనిమిదిమంది పాక్ పౌరులు మరణించారు. ఏడుగురు క్రికెటర్లు, అసిస్టెంట్ కోచ్ మాత్రం గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles