మెగుళ్లపై కన్నేసిందని యువతిని ఏం చేశారంటే | Furious wives attacking woman at restaurant in China

Furious wives attacking woman at restaurant in china

Furious wives attacking woman, woman attacking by wives for looking husbands, China wives beat woman i restaurant, women fight

Furious wives attacking woman at restaurant in China for looking their husbands.

ITEMVIDEOS:భర్తలపై కన్నేసినందుకు యువతిని ఏం చేశారంటే...

Posted: 09/01/2016 04:35 PM IST
Furious wives attacking woman at restaurant in china

వేరే అమ్మాయిల వంక కన్నెత్తి చూస్తే చాలూ మొగుళ్లని కూడా చూడకుండా, శివాలెత్తి పిచ్చి కొట్టుడు కొట్టిన భార్యల ఉదంతాలు చూశాం. తమ భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళలను నగ్నంగా రోడ్ల మీదకీడ్చి చెడా మడా వాయించిన సీన్లు ఈ మధ్య బాగానే దర్శనమిచ్చాయి. కానీ, తమ భర్తలను జస్ట్ చూస్తోందంటూ ఓ మహిళపై ఇద్దరు భార్యలు బట్టలు చినిగేలా పిచ్చికొట్టుడు కొట్టిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్లితే... బీజింగ్ లో ఓ రెస్టారెంట్ లో రెండు జంటలు భోజనానికి వచ్చాయి. అక్కడే ఉన్న మరో యువతి వారి భర్తలను తదేకంగా చూస్తుందని ఆరోపిస్తూ కోపంతో ఊగిపోయారు. అంతే ఏం కావాలే? అంటూ బూతులు తిడుతూ ఆ ఇద్దరు యువతిపై పడిపోయారు. కింద పడేసి చెడా మడా కొట్టేశారు. ఓ మహిళ తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తో ముఖం మీదే కొడుతుండగా, ఇంకోకామె తన కాళ్లకున్న హైహీల్స్ తో కడుపులో తన్నడం ప్రారంభించసాగింది. దుస్తులు చినిగిపోతున్నా, ఏడుస్తూ తానే తప్పు చేయలేదని వేడుకుంటున్నా కనికరించకుండా నిర్ధాక్షిణ్యంగా ఆ పెళ్లాలు చితకబాదారు.

ఇంత జరుగుతున్నా ఆ మహిళలను అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించకపోవటం విశేషం. ఆ భర్తలు కూడా పక్కనే ఉండి ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. ఇంకోందరు వీడియోలు తీసుకున్నారు. చాలా సేపు నుంచి ఓపిక పట్టిన ఓ వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతని గూబ కూడా ఆ ఇద్దరు మహిళలు గుయ్యిమనిపించారు. దీంతో అంతా వెనకడుగు వేశారు. వెరసి పదిహేను నిమిషాల పాటు ఇలా జరిగిన తర్వాత అలసిపోయిన ఆ మహిళలు ఆ యువతిని క్షమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  restaurant  wives  attack  woman  looking  

Other Articles