సినిమాల్లోలాగా లుంగీ పైకెత్తి పరుగెత్తిన నేత | Kerala MSF leader running for his life to escape lathicharge

Kerala msf leader running for his life to escape lathicharge

Kerala MSF leader run, Oru Indian Pranayakadha real scene, MSF leader run, Sayed Sharafudheen Jifri Thangal video, kerala leader funny video, leader lungi run

Kerala MSF leader running for his life to escape lathi charge.

ITEMVIDEOS:లుంగీ పైకెత్తిన నేత పరుగో పరుగు

Posted: 09/01/2016 05:20 PM IST
Kerala msf leader running for his life to escape lathicharge

మళయాళంలో మూడేళ్ల క్రితం 'ఓరు ఇండియన్‌ ప్రనాయకథా' అనే ఓ సినిమా వచ్చింది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఆ సినిమాలో పాహద్ ఫాసిల్, అమలాపాల్ జంటగా నటించారు. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకంటారా? అందులో ఓ సన్నివేశం ఉంటుంది. ఓ ఆందోళన సందర్భంగా దానికి నేతృత్వం వహించిన హీరో అది కాస్త తేడా కొట్టడంతో హీరో పరుగులంఘించుకుంటాడు. పోలీస్ లాఠీ నుంచి తనను తాను రక్షించుకునేందుకు లుంగీ చేతబట్టి పరుగులు పెట్టి తప్పించుకుంటాడు. ఆ సినిమాలో ఆ కామెడీ సీన్ కు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు ఆ సోదంతా ఎందుకంటారా? ఏం లేదు అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు కేరళలో చోటుచేసుకోవటంతో ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తుంది.

వివరాల్లోకి వెళ్తే కేరళలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీనికి ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నేత షరాఫుద్దీన్‌ నేతృత్వం వహిస్తున్నాడు. ఆయనగారు సోషల్ మీడియాలో ఓ చిన్న స్థాయి సెలబ్రిటీ కూడా. చట్టాన్ని గౌరవిస్తామని, హింస తమ విధానం కాదని, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని మీడియా ముందు కుండబద్దలు కొట్టాడు. ఇంతలో కార్యాలయం వెనుకగేటు నుంచి వెళ్లిన కొంతమంది ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ కు దీనిపై వినతి పత్రం ఇచ్చారు.

ఇదే సమయంలో ముందు గేటు వద్ద ఆందోళన చేస్తున్న పలువురు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇది హింసాత్మకంగా మారింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు లాఠీలు ఝుళిపించారు. లుంగీల్లో వచ్చిన ఎంఎస్‌ఎఫ్‌ నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొడుతుండగా, అంతలో ఓ వ్యక్తి వారి మధ్యలోంచి లుంగీ పట్టుకుని పరుగులు తీశాడు. దీంతో అంతలా పరుగెడుతున్నది ఎవరా? అని మీడియా ఫోకస్ చేయగా ఉద్యమాన్ని విరమించేది లేదని బీరాలు పలికిన ఎంఎస్ఎఫ్ లీడర్ షరూఫుద్దీన్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందుకే ఈ కంపేరిజన్ చేయాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  MSF leader  run video  

Other Articles