భారత్ బంద్ ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో తప్పని ఇబ్బందులు | Bharat Bandh raises anxiety on public services

Bharat bandh raises anxiety on public services

Bharat Bandh, All Unions Strike, public services effect by Bharath Bandh, Bharat Bandh September 2nd, Bharath Bandh banking

Bharat Bandh raises anxiety on public services in Telugu states.

ITEMVIDEOS:అర్థరాత్రి నుంచే భారత్ బంద్... తెలుగు రాష్ట్రాల్లో తప్పని కష్టాలు

Posted: 09/02/2016 09:01 AM IST
Bharat bandh raises anxiety on public services

తమ డిమాండ్ల సాధనకు ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జరగుతున్న భారత్ బంద్ నిన్న అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. దాదాపుగా దేశంలోని అన్ని ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఈ బంద్ లో పాలుపంచుకుంటున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి దాటాక నుంచే రోడ్లపైకి వచ్చిన కార్మిక సంఘాల నేతలు ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే బంద్ అమల్లోకి వచ్చినట్లైంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.

బ్యాంకు, టెలికాం సిబ్బంది కూడా బంద్ లో పాల్గొంటున్న నేపథ్యంలో నేడు అన్ని బ్యాంకుల శాఖలు మూతపడనున్నాయి. విద్యాలయాలను కూడా మూసివేసేందుకు కార్మిక సంఘాల నేతలు యత్నించే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నేటి తెల్లవారుజాముకే ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల ముందు కార్మిక సంఘాల నేతలు బైఠాయించారు. వెరసి ఇప్పటిదాకా ఒక్క బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు.

కాగా, ఈ సమ్మెకు ఆటో సంఘాల ఐకాస సైతం మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోనున్నాయి. కార్మిక చట్టాలను సవరించాలని, కార్మికులకు ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని, కనీసవేతనం రూ.18 వేలు ఇవ్వాలన్న పలు డిమాండ్లతో 11 కార్మిక సంఘాలు ఈ సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క రోజు బంద్ లో 18 కోట్ల ఉద్యోగులు పాల్గొననున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Bandh  September 2nd  public services  transportation  banking  

Other Articles